V
:

పెద్ద అగాధం

Author Name: Virinchi Virivinti
SOCIOLOGY/POLITICS

వ్యక్తి స్వేచ్ఛ, విభిన్న అభిప్రాయలను గౌరవించడం, చట్టపరమైన  సమానత్వం, మైనారిటీ హక్కులను అంగీకరించడం వంటి విషయాల్లో Constitutional India కి కుల మతాల అడ్డుగోడలతో కరడుగట్టిపోయిన Social India కి మధ్య చాలా పెద్ద అగాధం ఉంది. ఈ రెంటి మధ్యన ఒక గీత గీస్తే ఆ గీతకి కాస్త పైనో లేక కొద్ధిగా కిందో Institutional India ఉంటుంది.


ఒక చెడ్డ అధికారి వచ్చి తనకు అనుకూలంగా Institutions ని చక్కబెట్టుకునేంత బలహీనంగా ఈ వ్యవస్థలు ఉండకూడదు. వచ్చిన వాడు ఎంత చెడ్డవాడు ఐనా, వాడు అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేయాలని చూసినా,వాడి ఆటలు సాగనీయనంత బలమైన వ్యవస్థలు ఏర్పరచగలగాలి.


రాజకీయ నాయకుల అధికార దాహం, బ్యూరోక్రాట్ల అవినీతి, వ్యాపారస్థుల పన్ను ఎగవేతలు, పౌరుల లంచగొండితనం, ధనవంతుల నెపొటిజం,  పోలీసులపై రాజకీయ  నాయకుల బలవంత ఒత్తిడి  ప్రభావంతో పాటు, తరగతి గదిలో టీచర్ల ఫేవరేటిజం నుండి,  చివరికి క్యూ లైన్లో తమకే ముందు దక్కాలన్న మధ్యతరగతి వాళ్ళ తొందరపాటు వరకు, పైకి వేరువేరు అంశాలుగా అనిపించినా ఇవన్నీ ఒకే సాంస్కృతిక పర్యావరణంలోని భాగాలు.

All Replies

New to Communities?

Join the community