V
O:

opposition means not enemity

Author Name: Virinchi Virivinti
SOCIOLOGY/POLITICS

ఈ మధ్య రాహుల్ గాంధీ మాట్లాడుతూ..

నాకు మోడీజీ అన్నా, అమిత్ షా అన్నా పిసరంత శత్రుత్వం కూడా లేదు. అని.


ఇది ప్రజాస్వామ్య సంస్కృతి అసలైన రూపం తీసుకుందనడానికి ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి అంటే శత్రువు అనే అర్థం లేదు. 

ప్రజాస్వామ్య ఫ్రేం వర్క్ లో ప్రత్యర్థులు అంటే విభిన్నమైన అభిప్రాయం ఉన్న మరొక వ్యక్తి. అంతే. ఆ అభిప్రాయాన్ని మనం అంగీకరించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. అంతేకానీ ఆ వ్యక్తినే పూర్తి శత్రువుగా పరిగణించడం, అతడిపై వ్యక్తిగత దూషణలు చేయడం, మీడియాతో గేలి చేయించడం, ఖాన్ అనో మరోటనో, ముద్రలు వేయడం ఇత్యాదివన్నీ ఫ్యూడల్ స్థితిని తెలియజేస్తాయి. 


విభిన్న అభిప్రాయం ఉన్నంత మాత్రాన అది దేశ ద్రోహం ఐపోదనే స్పష్టత, విభిన్న అభిప్రాయాలకు స్థానం ఉంటుంది. వాళ్ళతో కలిసి జీవించవచ్చు వాళ్ళేమీ ఆగర్భ శత్రువులు కాదు, వాళ్ళను అంతం చేయవలసిన అవహరం లేదు అన్న స్పృహ మౌలికమైన ప్రజాస్వామ్య భావన. 

రాహుల్ వంటి మోడర్నిస్టులకు ఆ స్పష్టత ఉంటుంది.

పాతకాలపు భూస్వామ్య సంస్కృతిని జీర్ణించుకుని అలాగే జీవిస్తున్న వారికి ఇది అర్థం అయ్యే అవకాశం కూడా ఉండదు.

All Replies

New to Communities?

Join the community