తాను తీసుకున్న గోతిలో...

తాను తీసుకున్న గోతి లో....


వాషింగ్ మెషీన్ లోంచి వాష్ చేసిన బెడ్ షీట్స్ తీసి  కారిడార్ లో వాల్ మీద వేసి

తక్కువ భాగం సెల్లార్ లోకి ఎక్కువ భాగం కారిడార్ లోకి వుండేట్లు గా సర్దుతూ ఉంటే...


కింద నుండి వాచ్మాన్ అప్పన్న సెల్లార్ లో నుండి "అమ్మా! బట్టలు అక్కడ ఎయ్య మాకండి" అని అరిచాడు.


ఏమీ? ఇక్కడ ఎండ తగులు తోంది.

ఓ అరగంట లో ఆరిపోతాయి, లోపల కి తీసుకుపోతాను.' అన్నాను. 


"నీలు జారి పడతాయి. అల గెయ్య కూడదు తీసేయండమ్మా."  అన్నాడు.


"ఎక్కడ పడ్డాయి నీళ్ళు? అయినా డ్ర యర్ లోంచి తెచ్చిన బట్టలు నీకు నీళ్ళు కారుతున్నాయా." అన్నాను.


"అయ్యన్నీ నాకు తెల్దు.అలా గోడ మీద బట్టలు ఆరేయ్యొద్దని డీఎస్పీ గోరు  సెప్పారు.మీరు  తియ్యాల." అన్నాడు వాడు పొగరుగా.


"అయితే ముందు నువు పోయి ఆయనకి వాళ్ళ ఫ్లోర్ లో నలుగురూ నడిచే త్రోవ లో మెట్ల దగ్గర వాళ్ళ 

చెత్త బుట్ట నిండా చెత్త తో పెడుతున్నారు ప్రతి రాత్రి.అది కుక్కలు, కాకులు లాగేసి ఎముకలు, ఎంగిలి మెతుకులు అన్నీ నడిచే త్రోవలో పడుతున్నాయి. అందరికీ ఇబ్బంది గా ఉంది. బాధ పడుతున్నారు. అది  నేను తీసేయమన్నానని చెప్పు. అది వాళ్ళు తీసి అక్కడ శుభ్రం చేశాక వచ్చి చెప్పు. అప్పుడు తీస్తాను ఈ బట్టలు." అని  స్పష్టం గా  పెద్ద గొంతుకతో కిందకి వినబడేలా చెప్పి వచ్చేసాను లోపలకి.

*******

సాధారణం గా బయటికి వచ్చి ఏమీ ఎప్పుడూ అనని మనిషిని అలా గట్టిగా

పెద్ద గొంతుకతో  కఠినం గా మాట్లాడటం ఎదో పని మీద అటుగా వచ్చిన 

మా ఫ్లోర్ లో ఉన్న రజని కి ఆశ్చర్యం కలిగించింది.


తానూ నాతో పాటుగా లోపలికి వచ్చి "ఏమయింది ఆంటీ?" అంటూ  కుతూహలం గా అడిగింది.


జరిగింది చెప్పాకా..


"ఆంటీ! అతను అందరి మీద అలాగే జులుం చలాయిస్తాడు. మొన్న మా  కార్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న మా కార్ ను తాగి మోటార్ సైకిల్ మీద వచ్చి గుద్దే సాడు.కార్ బాక్ సైడ్ లైట్ పోయి సొత్త పడి పోయింది. రిపేర్ చేయించ మంటే బూతులు తిట్టాడు. వాడు పరమ నికృష్టుడు వాడితో పెట్టుకోకండి అని అదే ఫ్లోర్ లో బాంక్ అంకుల్ చెప్పారు. ఎందుకొచ్చిన గొడవ అనీ,

మా వారికి అసహ్యం వేసి వాడి కో దండం పెట్టి తానే రిపేర్ చేయించు కున్నారు.


ఈ రోజు మీరిలా సమాధానం చెప్పారు కదా తాగొచ్చి బూతులు తిడతాడు.  వాడో అశుద్ధం. అశుద్ధం మీద రాయి వెయ్య కూడదు. మీరు పెద్ద వారు మీకు చెప్పే పాటి దాన్ని కాదు కానీ." అంది రజని.


"తిడితే తిట్టనీ. వాడి సంస్కారం బయట పడుతుంది. నేనూ వాడి తీరు చూస్తున్నాను. ఈ అపార్ట్మెంట్స్  వాడి తాత గారి జాగీరు కాదు. నాకు ముడుకులు నొప్పి. నేను టెర్రస్ మీదికి వెళ్ళి బట్టలు ఆర వేయలేను. అన్నీ లోపలే వేసాను. ఎప్పుడో తప్ప  బయట బట్టలు వేయాల్సి రాదు నాకు. ఈ సారి మా అమ్మాయి వచ్చి వెళ్ళటం వలన ఓ రెండు  బెడ్ షీట్స్ ఎక్కువ అయ్యాయి. ఈ రోజు ఉతికి ఇక్కడ ఆరేసాను. ఓ అరగంట లో తీసేసాను. ఆ మాత్రం దానికి సెల్లార్ లోంచి ఆ అరుపులు ఏమిటి. అందికే అలా సమాధానం చెప్పాను." అని కూల్ గానే నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరించాను..


"ఆ  పోలీసోడు మంచోడు కాడు. ఆడి జోలికి ఎల్ల మా కండమ్మా అంటాడు ఆ వాచ్మాన్ ఆంటీ. వాడికి గొప్ప తల బిరుసు తనం. వాడికి ఎదురు చెబితే సహించలేడు. ఎంతకయినా తెగిస్తాడు నికృష్టుడు అని అందరూ అతగాడి తో తలపడక దూరం గా వుంటారు.మీరు 

ఒక్కరూ వుంటారు. జాగర్త. మా వారు కూడా అందికే ఆ దరిద్రుడి తో ఎందుకొచ్చిన పెంట, తంటా అని  కారు రిపేర్ చేయించుకున్నారు." అంది అసహ్యం నిండిన గొంతు తో.


"వాడి మొహం. ఉత్తి తాగు బోతు వెధవ.వాడేం చేస్తాడు అమ్మా. వాడు తిట్టే తిట్లు నాకు వినబడవు.  నన్ను తిడితే వాడి కుసంస్కారం బయట పడుతుంది గానీ. అయినా వాడి గురించి ఒక్కడు ఓ మంచి మాట అనగా వినలేదు ఇంతవరకూ నేను.  తన అహంకారానికి ఎదో ఒక రోజు కోలు కోలేని దెబ్బ తింటాడు. ఇందరి ఉసురు పోసుకుంటున్నాడు గా తప్పక ఇంతకింత అనుభవిస్తాడు. అయినా  ఇలా వాచ్మాన్ ల చేత చెప్పిస్తే నేను వినను.  అతను నా దగ్గరికి రాలేదు. అతను వచ్చి  నాకు చెప్పినపుడు చూస్తాను ఏమి, ఎలా చెప్పాలన్నది." అన్నాను దృఢంగా.


"సరే ఆంటీ! జాగర్త!" అని రజని వెళి పోయింది.


నేను వేరే పనిలో పడ్డాను.


కాసేపటికి  దుప్పట్లు అరిపోయాయి. లోపలికి తెచ్చేసాను. 

****

మధ్యాహ్నం వాచమన్ భార్య వచ్చింది.

డీఎస్పీ భార్య ఇకపై అలా బట్టలు గోడ మీద వెయ్య వద్దని కబురు పెట్టింది.


అలాగే అనేసాను. అర్ధం అయింది గురుడు కి మన సమాధానం చెప్పటం కొరుకుడు పడలేదని. అయినా అతడే వచ్చినపుడు చూదాం లే అనుకున్నాను.

****

మర్నాడు మళ్లీ  ఓ బెడ్ షీట్ కారిడార్ లో వేసాను. 

వాచ్మాన్ ఈ సారి పైకి వచ్చి "అమ్మా! అలా వేయకండి. ఆ బాబు తో మీకెందుకు పంతం." అన్నాడు.


"పంతం లేదు నాకు. నా కాళ్ళు నొప్పి నేను మీదకి వెళ్ళి ఆరవేయ లేను. ఓ అరగంట లో ఆరి పోతుంది తీసేస్తాను లే." అన్నాను.


"మీరిలా అరవేస్తే అందరూ అరవేస్తారట ఆ బాబు తీసేయ్య మంటున్నారు."అన్నాడు. 


కింద నుంచి అరిస్తే నేనూ అరుస్తానని అతని పరువు పోతుంది అని భయ పడి ఓ మెట్టు దిగాడు అని అర్ధం అయింది..


అయినా పైకి ఏమీ అనకుండా..

"చెత్త బుట్ట తీసారా వాళ్ళు." అని అడిగాను. 


"లేదమ్మా! ఆలె పుడూ  అలగే  ఆడ నే ఎడతన్నారంత.  అలగే  ఎడతారట. తియ్యరంత.' అన్నాడు.


"సరే లే! నేనూ మా ఫ్లోర్ లో ఇక పై ఇలాగే బట్టలు అరవేస్తాను. ఆరే వరకూ బట్టలు తియ్యను అన్నానని చెప్పు." అని వాడిని పంపేసాను.


వాచ్మాన్ వెళ్ళాక రజని వచ్చింది. "మీరు మంచి పని చేసారు  అన్నారు మా వారు. వాడికి ఇలా నలుగురు తగులు కుంటే బుద్ధి వస్తుంది అంటూ ఏ రాత్రో తాగి వచ్చి బూతులు తిడుతూ గొడవ చేస్తాడు. పాపం ఆంటీ అనవసరం గా తిట్లు తినాలి ఈ వయసులో అని మా వారు బాధ పడ్డారు ఆంటీ." అంది.


పర్లేదమ్మా. తాగిన వాడి మాట ఎవడు పట్టించుకుంటాడు. నన్ను ఏమి తిట్టినా నాకు వినబడవు. అన్యాయం గా తిడితే అవి వాడికే తగులు తాయి.

తేరుకోలేని దెబ్బ తింటాడు. అప్పుడు ఏడుస్తాడు అమ్మా.నాకేమీ భయలేదు. అమ్మా. ఈ తాటాకు చప్పుళ్ళు కి బెదిరి పోవటానికి నేనేమీ కుందేలుకు కాను.  నేను అలాటివి ఏవీ పట్టించుకోను."

అన్నాను.


సరే ఆంటీ. జాగర్త అనేసి రజని వెళిపోయింది.

******

అతని ధోరణి , అహంకారం అన్నీ తెలిసిన నేను తగ్గదలుచు కోలేదు. అందికే రోజు కనీసం ఒక దుప్పటి తెచ్చి అక్కడ వేయటం చేస్తూ వచ్చాను.


ఎవరు చెప్పినా వినను అనుకున్నారేమో మరెవరూ నాకు చెప్పలేదు. అతడు నా దగ్గరికి రాలేదు.


అతని ఫ్లాట్ లో చెత్త బుట్ట తియ్యలేదని అతని మీద పీకల వరకూ కోపం ఉన్న రజని చెప్పింది. అంతే గాక రోజూ అతని లీలా విశేషాలు ఇంటా ,బయటా  అన్నీ నాకు చెప్పటం మొదలెట్టింది రజని. 


దాంతో నాకు తెలిసిన దానికన్నా ఎన్నో రెట్లు అతగాడు ఖతర్ నాక్ అని అర్ధం అయింది. అయినా నన్ను వచ్చి అడిగితే చూదాం అని ఊరు కున్నాను.


ఓ రోజు రజని వుండబట్టలేక "అదేంటి ఆంటీ మీరు రోజు అక్కడ బట్టలు వద్దన్నా వేస్తుంటే గురుడు సైలెంట్ అయిపోయాడు. మీమీద వచ్చి  అరవ లేదు." అంది నవ్వుతాలుగా..


"అతను చెత్త బుట్టకి లింక్ పెట్టానుగా. అందికే నోరు, కాలు, చెయ్యి నా విషయం లో చచ్చు పడి పోయాయి గురుడికి." అన్నాను చిన్నగా నవ్వుతూ.


"బాగా చెప్పారు ఆంటీ! వాడి కి మీరు ఇస్తున్న ట్రీట్మెంట్ మా ఆయనకి తెగ నచ్చేసింది అనుకోండి." అంటూ  వాళ్ళు చేయలేని పని నేను చేసినందుకు అతడి మీద వున్న కసి వల్ల వాళ్ళకి తెగ ఆనందం పడుతున్నారు రజని దంపతులు.

******

వారం గడిచింది.

ఆ రోజు సాయంత్రం హడావుడి గా  రజని వచ్చి వెయ్యి వాట్ల బలుబు లా వెలిగి పోతున్న మొహం తో

"అంటీ టీవీ లో న్యూస్ చూసారా?" అని అడిగింది.


"లేదమ్మా! ఏమీ!!"అన్నాను.


"మన గురుడికి చావు దెబ్బ తగిలింది.ఆంటీ! మీ మాట నిజం అయింది! ఆఫీస్ లేడీ స్టాఫ్ మెంబర్ తో వెకిలి వేషాలు వేస్తుంటే ఆ అమ్మాయి  వీడిని "ఇంటికి రా! నీకు సహకరిస్తాను!" అందిట. ఈ గురుడు వెళ్ళాడు. ఆపిల్ల భర్త వీడిని కట్  డ్రాయర్ తో వాళ్ళ బెడ్ రూంలో వీడియో తీసి దాన్ని టీవీ కిచ్చేసాడు.రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.  రిటైర్ అయే ముందు గొప్ప జెల్ల తగిలింది. సస్పెండ్ అవుతాడు.

అందరి మీదా భౌ, భౌ అని ఎగిరే వాడు రేపటి నుండీ మియావ్ అని ఇంట్లో కూచుంటాడు. వాడికి తగిన శాస్తి జరిగిందని మన అపార్ట్మెంట్స్ లో అందరూ చాలా హ్యాపీగా వున్నారు ఆంటీ. రేపటి నుండి ఈ దరిద్రుడు మరి నోరెత్తడు. వాడి గొయ్యి వాడే తవ్వు కున్నాడు. అందరి ఉసురు పోసుకున్నాడు. ఇప్పుడు పెన్షన్ అవీ రాక కుక్క చావు చస్తాడు." అంటూ రజని ఎంతో ఉత్సాహం గా, ఆనందం గా చెబుతుంటే...


ఇంత  మంది ని ఇలా కాల్చుకు తిన్నవాడు నన్ను ఎందుకు వచ్చి అడగలేదు అని సందేహం కలిగి..


హుమ్.. లోకం అంతే...

మనం నిలబడితే కలబడతారు. కల బడితే నిలబడతారు. బహుశా అపార్ట్మెంట్స్ లో నేను అంత గట్టిగా అరిచి కలబడటం, తన నలుపు అదే తన చెత్త బుట్ట తనకి చూపటం తో గురుడు నిలబడి పోయాడేమో..


చెత్త బుట్ట తీస్తే నాకు లొంగి నట్లవుతుంది. ధిక్కారమును  సైతునా

అనటానికి వీలు లేకుండా తన చెత్త బుట్ట తనకి అడ్డు రావటం తో చేసేది  లేక తోక ముడిచి ఉంటాడు.మరో అవకాశం కోసం ఎదురు చూస్తూ.ఈ లోపల ఖర్మకాలి, పాపం పండి తాను తీసుకున్న గొయ్యి లో తానే పడ్డాడు.

." అని సరి పెట్టుకున్నాను.


ఏది ఏమైనా పెద్ద పీడ విరగడయ్యింది. ఇక మీద ఎవరి మీదా వచ్చి తలా  తోకా లేకుండా అరవడు. అయినా

ఉచ్ఛనీచాలు లేకుండా మిడిసి పడే అహం కారులు మట్టి కరిచి తీరు తారు అని  అనుకోకుండా ఉండలేక పోయాను. 

                             ********

Highlight any text to reply to that part.

All Replies (1)

R
బాగా చెప్పారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేక మనిషి యొక్క అసలు గట్టు, సంస్కారం ఎప్పుడోకప్పుడు బయట పడ మానదు.

Please log in to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026
I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026

New to Communities?

Join the community