V
F:

For sale

Author Name: Virinchi Virivinti
MISCELLANEOUS TOPICS/POETRY

For sale / Virinchi Virivinti 


సమానత్వం

కొత్త ఎడిషన్ వచ్చిందండీ

మానవత్వం - చివరి కొన్ని కాపీలే!

త్వరపడండి.

ఆత్మ గౌరవం ఐపోయాయి.

గూగుల్ పే చేస్తే

ఆన్లైన్ వెర్షన్ పంపిస్తాం.


ఈ విప్లవం సంగతేంటో మరి

50% తగ్గింపు ..

ఈ ఒక్క రోజే!


మోడెర్నిటీ &- భజన గీతాలు

Buy one get one offer లో ఉన్నాయి.


పోస్ట్ హ్యూమనిజం

కవర్ పేజీ నే లావిష్ లుక్...

అద్దిరిపోయింది!


దాస్ కాపిటల్

499 మాత్రమే!

స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ లో...

గిఫ్ట్ ప్యాక్ ఖర్చులు అదనం!


డిస్కౌంట్ బాస్కెట్ లో

మానవతా విలువలు.


ఇది కాదండీ

తత్వశాస్త్రం లార్జ్ సైజులో కావాలి.

ఉమ్..పోనీ

ఈఎమ్ఐ సౌకర్యం ఉందా!


సామాజిక న్యాయం 

ఫెమినిజం

పాత ఎడిషన్లే ఉన్నాయి.


రండి రచయితల్లారా

వచ్చి అమ్ముకోండి.

మీ ఆలోచనలకు 

బార్ కోడ్లు అతికిద్దాం.

ప్రగతిశీలుడివైతే లేచి రా!


క్రెడిట్ కార్డ్లతో అభిమానులు ఒచ్చారు

సంతకాలు చేసేందుకు

నిలబడి ఉండండి.


పుస్తకాలు ఎవడైనా రాయగలడు

హాటు కేకుల్లా అమ్మినోడే

మొనగాడు.


చిరగని చొక్కా వేసుకో

ఒక్క పుస్తకమైనా అమ్ముకో!


మీ ప్రగతిశీల ఆలోచనకు ధన్యవాదాలు.

మార్కెట్ లేకపోతే

ప్రగతికి లేదు ఆనవాలు.

All Replies

New to Communities?

Join the community