నీవు చూశావా?
బొమ్మలు పట్టాల్సిన చిన్న చేతులు,
తుపాకులు పట్టి వణికిపోతున్నాయి.
నీవు గమనించావా?
నిద్రలో కలలు కనే కనురెప్పలు,
భయంతో మూసుకుని వెలుగు కరువయ్యాయి.
తల్లి ఒడిలో చిరునవ్వులు పూయాల్సిన హృదయాలు,
గుండుగోళాల్లో చిమ్మకుంటున్నాయి.
తండ్రి చూపుతో వెలిగే కళ్లలో,
ఇప్పుడు ఆశల వెతలు మాత్రమే మిగిలాయి.
ఆయుధాలు కాదు.. స్నేహం కావాలి
రణరంగం కాదు..పిల్లలు నవ్వే లోకం కావాలి..
శాంతి పూచే భూమి కావాలి
యుద్ధం ముగిసిన ఓ కొత్త ఉదయం పసి ప్రాణాలకు స్వేచ్ఛ కావాలి.......
అక్కడ ప్రతి పసిప్రాణం
స్వేచ్ఛగా శ్వాసించాలి,
సంతోషంగా నవ్వాలి.
Highlight any text to reply to that part.