రేపటి యముడు!!

రేపటి యముడు!! అనే కవిత 'యుద్ధం లో pillalu'

అనే శీర్షిక కోసం వ్రాయబడినది.ఇది  నా స్వంతం.దేనికీ అనువాదం, అనుకరణ కాదు...

Savitri Ramanarao 


రేపటి యముడు!!!


పుడమంతా పరుచుకున్న యుద్ధ మేఘాలు,

కురుస్తున్న క్షిపణుల కుండ పోతలు.

పేలిపోతున్న  నగరాలు;

రాలి పోతున్న వుసురులు. 

వణుకు తప్ప కునుకు ఎరుగని

చూలింతల గర్భ స్రావాలు,

కడుపు పంటను కోల్పోయిన బాలింతల దీనాలాపాలు.

ఖర్మ కాలి బతికి బయట

పడిన బిడ్డ;

ఆలనా పాలనలకు నోచుకోని

అనాధ.

చేయని నేరానికి దారుణ శిక్షలు అనుభవిస్తున్న పసి కూనలు,

మారణ హోమాల్లో సమిధల

వుతున్న అసంఖ్యాక రేపటి పౌరులు.

మానవాళి నొసటన మనిషి కార్పణ్యం చేసిన మానని  గాయం,

మొగ్గ గానే చిదిమేస్తూ పూవులను వికసించనీయని ఈ కర్కశత్వం,

మతమో, అతి దాహమో; కారణ మేదైనా కాటేస్తున్న నియంతృత్వం,

ఈ భూమిని అనాదిగా పట్టి పీడిస్తున్న పెను జాడ్యం,

సంకుల సమరం అనే ఈ సంకటం ద్విపాద పశువుల, నైజం, నిర్వాకం.


రణ కింకరుల 

పాల పడి, 

తమ వారలకు

దూరమయి,


ముక్కు పచ్చ లారని ముద్దు బిడ్డలు వికలాంగులై,

జోల,లాల లెరుగని పసి గుడ్ల

బతుకులు తెగిన గాలి పటాలై;


అయోమయంగా,

అమాయకంగా,

ఈ బాల జీవశ్చవాలు

ఈ ఘోర శవసేద్యఫలాలు


శరణార్థుల శిబిరాల ఉచ్చుల లోకో,

మొట్టి చేయించే వెట్టి చాకిరీల చిచ్చుల లోకో;


తరలించ బడుతూ, 

కరుణించమంటూ;


ఆరళ్ళకు, అత్యాచారాలకు గురై,

వసి వాడి పోతూ, మసి బారి పోతూ,


ఈ రాక్షస, దుష్ట , నికృష్ట  అమానవీయ

కృత్యాలకు:


దగ్ధ మవుతున్న అపురూప కిశోర సౌకుమార్యం,


వీరు మనసులలో  రగిలి,

తమలో తాము మరిగి; 


రేపు ఆత్మాహుతి దళాలు గానో, 

బాల సైనిక బృందాలు గానో,


వచ్చి తిరగబడితే?

రెచ్చి తెగ బడితే??


నేటి ఈ నియంతల ఘోర రణ తంత్ర ఫలం,


ఇలా  నిరాదరణ కు గురైన బాల్యం,


రేపు విచక్షణ లేని మృగాలై తెగ బడితే...


మరిన్ని మారణ హోమాలకు పూర్వ  ప్రస్ధానాలయితే??


చీకటి దారుల్లోకి మొత్తం ప్రపంచాన్ని నెడితే ???


ఆ పాపం ఎవరిది?

ఆ శాపం ఎవరికి?


అహాల ఆరాటాల, ఆపని పోరాటాల,

అంతులేని స్వార్ధాల, అత్యంత క్రూర తత్వాల,

వికృత రతులు ఇలాగే కొన సాగితే..

ఇహాల, పరాల స్పృహలేని 

మౌఢ్యాలు ఇలా కసు గాయలను  కబళిస్తే...


ఆ విషపు పడగ నీడల్లో,

ఆ విధ్వంస వాడల్లో:

గాయాలు గా పుట్టి,

గాయాలుగా ఎదుగుతూ,

నేడు రక్తాశ్రువులు రాల్చే ఈ బాల గాయాలే;

రేపు ఎదిగి కసితో చేయవా మరెన్నో తీవ్ర గాయాలు?


మానని ప్రతి గాయం అయి తీరుతుంది;

జాతి మనుగడకు పక్కలో బల్లెం!

ఆరని  అనలం  ఆపదు 

దహించడం అన్నది చరిత్ర చెబుతున్న చేదు నిజం.


నేటి ఈ రణ  సృష్టి,

ఈ దారుణ పరిస్ఠితి;

రేపు కోట్ల ఎదల్లో 

మరిగే లావాలకు నాంది.


ఈ  బాల గాయాలకు..

ఈ  బేల హృదయాలకు..


ప్రేమ మలాములు పూయక పోతే...

ఈ కన్నీటి కథలకు చరమ గీతి 

పాడక  పోతే...


ఈ  రోదించే  చిన్నారులే

రేపటి బద్దలయే  అగ్ని  పర్వతావుతాయి!! 

ఈ రగులుతున్న హృదులే రేపు ఆరని రావణ కాష్టాలు రాజేస్తాయి!!!

ఈ ద్వేషం కాటేసిన బాల్యాలే రేపు  విష జ్వాలలై విరుచుకుపడి మాయని రక్త చరిత్రలు  లిఖిస్తాయి!!!!


అవును...


నేటి యుద్ధం లో గాయ పడ్డ ప్రతీ బాలుడు;

రేపటి నరజాతి పాలి మరో కాల యముడు కాగలడు!!

Highlight any text to reply to that part.

All Replies (1)

R
The influence of war on children will have a ripple effect that may be a positive change or the negative but sure to be shattering lives.

Please log in to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026
I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026

New to Communities?

Join the community