ఉక్రెయిన్ మహిళలు: పేదరికం, యుద్ధం మరియు అవమానాలు

రెండు నెలల కిందట అనుకుంటా ఒకతను ఆడవాళ్ల గురింఛీ హేట్ పోస్ట్ లో  ‘ఉక్రెయిన్ నించి పారిపోయి దుబాయ్ కి వచ్చి వ్యభిచారం తో పొట్ట పోసుకునే అభాగినిలా ఆకర్షణీయంగా ఉంది ఆమె మొహం’ అని మొదలు పెట్టి, ఇంకేవేవో రాస్తూ పబ్లిక్ పోస్ట్ పెట్టి తన మనో వికారాన్ని ప్రదర్శించినడు. నాకు తను అట్ల అన్నదానికంటే , వేశ్యవృత్తి లో ఉన్న వాళ్ళను, ఉక్రెయిన్ మహిళలనూ తిట్ల కోసం వాడుకున్నందుకు చాలా బాధనిపించింది, కోపమొచ్చింది. ఇక్కడ మూడు విషయాలున్నాయి. వేశ్య ను తిట్టడానికి ఉపయోగించడం, ఉక్రెయిన్ వాళ్లంటే వేశ్యలే అనే అభిప్రాయం కలిగుండడం, యుద్ధం లో పారిపోయిన వాళ్ళ గురించి జాలి పడకపోగా వాళ్లు వేశ్యవృత్తినే ఎంచుకుంటారు అనీ అమానవీయంగా అవమానించడం. 


వేశ్య వృత్తి ఎవరూ కావాలని ఎంచుకోరు. చాలా మంది స్త్రీలు పేదరికం, ఆకలి వల్ల విధి లేక వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్య ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరుతో అమాయక బాలికలని నిర్భందించి ( కిడ్నాప్ చేసి) వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. ఒకవేళ ఆ వృత్తిని కావాలని ఎంచుకున్నా అది వారి వ్యక్తిగత విషయం. దాంట్లో మోసం, కుట్ర లాంటివేవీ లేవే. అయినా వాళ్ల సర్వీసెస్ని ఆనందిస్తున్న పురుషులను వదిలేసి వాళ్లను తిట్టడం, ఆడ, మగ ఎవరిని తిట్టాలన్న వాళ్లను ఉయోగించడం సమంజసం

కాదు. దీని గురించి ఇప్పటికి చాలా మంది ఇంకా బాగా రాసుంటారు, కాబట్టి నేనెక్కువ ఏం చెప్పను.


అయితే ఉక్రెయిన్ మహిళలు అనగానే చాలా నీచంగా అవమానించడం, వేశ్యలు అని స్టీరియోటైపికల్ ముద్ర వేయడం ఘోరం. ఇది కేవలం అతని అభిప్రాయం మాత్రమే కాదు, ప్రపంచమంతా అట్లానే అనుకుంటుంది. వివరాల్లోకి పోతే..


ఈ మధ్య కాలంలో వేశ్యావృత్తికి, మహిళల, పిల్లల లైంగిక ట్రాఫికింగ్ కీ ఉక్రెయిన్ గమ్యస్థానంగా మారింది. ఉక్రెయిన్‌లో విస్తృతంగా వ్యాపించి ఉన్న వేశ్యా వృత్తి చట్టవిరుద్ధమైనప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు. 2011లో ఉక్రెయిన్ సామాజిక అధ్యయనాల సంస్థ ప్రకారం, 50,000 మంది మహిళలు వేశ్యావృత్తి చేస్తుండగా, ప్రతి ఆరవ వేశ్య ఒక మైనర్. అదీ కాక చాలా మంది మహిళలకు సెక్స్ వర్క్ మాత్రమే సరిపడే ఆదాయ మార్గంగా మారింది. ఈ వృత్తి చేసే వాళ్లలో 50%కి పైగా మహిళలు ఆ డబ్బు తో తమ పిల్లలను, తల్లిదండ్రులను పోషిస్తున్నారు.


ఉక్రెయిన్‌లో, పిల్లలు తరచుగా బాల కార్మికులుగా ఉండడం లేదా లైంగిక దోపిడీలకు గురవ్వడం జరుగుతుంటుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు, అనాథ పిల్లలు, ముఖ్యం గా ఏ విధమైన రక్షణ లేకుండా వీధుల్లో నివసిస్తున్న పిల్లలు వేశ్యావృత్తికి గురయ్యే అవకాశంఎక్కువ. అందువల్ల తక్కువ వయసున్న అమ్మాయిలతో తరచుగా బలవంతంగా వ్యభిచారం చేయిస్తారు. ఈ అమ్మాయిలలో చాలా మంది అత్యంత పేదరికంలో నుంచి వస్తారు. వారిలో చాలా మందికి తమ స్వంత కుటుంబాలు ఉండవు లేదా వారి తల్లిదండ్రులు మద్యపానం, డ్రగ్స్ కి బానిసలై వుంటారు. 


2016 లో, ఉక్రెయిన్‌లో మానవ అక్రమ రవాణా బాధితులలో సుమారు 10% మంది మైనర్ బాలికలు ఉన్నారు. ఈ టీనేజ్ బాలికలు అనాథలు గా వీధుల్లో జీవిస్తూ కేవలం బట్టలు, ఆహారం కోసం మగ వాళ్లకు లైంగిక సేవలు అందించేవారు. ఒక్క సారి  అందులోకి దిగినాక, చట్టాల అమలు సరిగ్గా లేనందు వలన, వేరే ఉపాధి అవకాశాలు లేక పోవడం వల్ల అందులోనే కొనసాగుతారు. ముఖ్యంగా మహిళలను మరియు బాలికలను ఉద్యోగం ఇస్తామన్న అబద్ధప్రతిపాదనలతో విదేశాలకు ఆకర్షించి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు 

ఈ విధంగా వుక్రెయిన్ లైంగిక దోపిడీ బాధితుల ప్రధాన మూలంగా మారింది. 


ఈ పదమూడేళ్లలో ఇవి ఖచ్చితంగా ఎక్కువ అయి ఉండే అవకాశమే ఉంది. ఉక్రెయిన్ లో పరిస్థితి ఇట్లా వుండటానికి కారణాలేంటి?


కొంచెం వెనక్కి పోతే, రెండవ ప్రపంచ యుధ్ధం యూరోప్ లో అతిపెద్ద శరణార్థి సంక్షోభానికి దారి తీసింది. యుద్దం గెలిచిన తర్వాత రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించుకున్నప్పుడు, దాదావు ఎనభై లక్షల మంది ఉక్రెనియన్లు దేశం వదిలిపోయారు. దీని వలన ఉక్రెయిన్ మహిళలు మరియు పిల్లలు పొలాండ్, జర్మనీ, చెక్ రిపబ్లిక్ వంటి ఆతిథ్య దేశాల్లో శరణార్థులుగా పోయినప్పుడు, క్రిమినల్ నెట్‌వర్క్లు వాళ్ళ ఈ దుర్బలమైన స్థితిని ఆసరా గా చేసుకొని, శరణార్థులను లైంగిక దోపిడీ కోసం ఉపయోగించారు, అందులో చిన్నారుల దుర్వినియోగం కూడా ఉంది. అట్లా మొదలైంది. 


అయితే 1991 లో సోవియెట్ యూనియన్ నించి విడిపోయి, ఉక్రెయిన్ స్వతంత్రత సాధించిన తరువాత, దేశం ప్లాన్డ్ ఆర్థిక వ్యవస్థ నుండి మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు మారే క్రమంలో తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నది. స్వతంత్రం వచ్చిన మొదటి దశాబ్దంలో సుమారు 80% ప్రజలు పేదరికంలో పడిపోయారు. దీంతో విస్తృతంగా నిరుద్యోగం పెరిగింది, ముఖ్యంగా మహిళలలో. వేరే గత్యంతరం లేక 2000ల యొక్క ప్రారంభంలో, వేశ్యావృత్తి అనేక మహిళలకు జీవనోపాధిగా మారింది. ఇది చట్ట బద్ధం కానప్పటికీ, మానవ అక్రమ తరలింపు ( human trafficking), బలవంతంగా చేయించే వేశ్యావృత్తి లాంటి వాటిపై  చట్టాల అమలు బలహీనంగా ఉండింది. 2012లో యుక్రెయిన్ UEFA యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్షిప్‌ను పోలాండ్ తో కలిసి నిర్వహించిన తర్వాత ఉక్రెయిన్ లో ‘లైంగిక పర్యాటక రంగం’ ( sex tourism) పెరిగే సరికి, ఈ పరిస్థితి మరింత పెరిగింది.


ఇప్పటికే వీళ్ల పరిస్థితి ఇట్లుంటే, 2022లో రష్యా ఉక్రెయిన్ పై జరిపిన ఆక్రమణ లైంగిక కార్మికులపై తీవ్రమైన ప్రభావం చూపింది. ముఖ్యంగా HIV లేదా మద్యపాన వ్యసనంతో ఉన్న వారికి ఆరోగ్య సేవలను అందించడం చాలా కష్టం అయ్యింది. ఆరోగ్యపరంగా కొన్ని ఏళ్లుగా సాధించిన అభివృద్జి, యుద్ధం కారణంగా తిరోగమించింది. చాలా మంది లైంగిక కార్మికులు సేవలు కోల్పోయినా, తక్కువ ఆదాయాలు మరియు పెరిగిన భద్రతా ప్రమాదాలను ఎదుర్కొంటూ పనిచేయడం కొనసాగించారు. యుద్ధం వలన విదేశీ క్లయింట్స్ తగ్గిపోయారు. సైనికులు వాళ్ల మీద లైంగిక దౌర్జన్యం చేసి డబ్బివ్వకుండా వాళ్ల దగ్గర ఉన్న డబ్బును లాక్కొని, కొట్టి, raపులు చెయ్యడం మొదలు పెట్టారు. ఇది తట్టుకోలేక చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్ లేకపోయినా విదేశాలకు పోయి వేశ్య వృత్తి ని చేపడుతున్నారు.


కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మహిళలు ముందునుండి పోరాటం చేస్తున్నారు.చాలా మంది మహిళలు వివక్ష, వేధింపులు, మరియు అవకాశాలు ఇవ్వబడకపోవడం లాంటి సవాళ్లను ఎదుర్కుంటూనే సైన్యం లో చేరి తమ దేశ రక్షణ కోసం , గౌరవం కోసం పోరాడుతున్నారు. అంతే కాక యుద్ధ కాలంలో సమాజ సేవకులుగా, నాయకులుగా, ప్రజలకు జీవనోపాధి అందించే వారిగా , సంప్రదాయంగా పురుషులకే చెందిన భద్రతా రంగం, రవాణారంగం లాంటి వాటిలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


అక్కడి స్త్రీ వాద సంస్థలు తమ దేశ మహిళలకు వచ్చిన ఈ పేరును పోగొట్టడానికి, మహిళలకు చదువు, ఉపాధి కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.


విధిలేక ఈ వృత్తి లో దిగిన వారిని, బాల్యంలోని బలవంతం చేయబడి ఈ వృత్తి లోకి దింపబడిన వారిని, అసలు ఇవేవీ కాకుండ యుద్ధం లో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారినీ, మొత్తంగా ఉక్రెయిన్ మహిళలను అసలేమాత్రం మానవత్వం లేకుండా యుద్ధం లో పారిపోయి వచ్చిన మహిళలని హేళన చేయడం ఎంతవరకు సమంజసం.


ఆలోచించండి !!


మాలతి పల్లా

17-Dec-2024

Highlight any text to reply to that part.

All Replies (2)

R
Can't agree more.
War is the reason for exploitation.
There are many other reasons too... Socio-economic status of the country, political inefficiency, corrupt society... everything that plays a role behind the state of women. Humanity is also declining rapidly. Not in sight of good days ahead. Women has to bear the brunt for any downfall, our history has innumerable evidences.

Please log in to reply.

V
“All violence consists in some people forcing others, under threat of suffering or death, to do what they do not want to do.” – Leo Tolstoy

Please log in to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026
I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026

New to Communities?

Join the community