పెళ్లంటే నూరేళ్ల ( un conditional) అంగీకారమా

Raప్ (అత్యాచారం) అనేది ఒక వ్యక్తి సమ్మతి లేకుండా, సంపూర్ణ అంగీకారం లేకుండా, దౌర్జన్యం తో లైంగిక సంపర్కం లేదా ఇతర రకాల లైంగిక చర్యల తో కూడిన లైంగిక వేధింపు. చాలా సార్లు బాధితురాలిపై తమ బల నిరూపణ లో భాగం గా కూడా లైంగిక అత్యాచారం చేస్తారు. 


ఇది పెళ్ళైన తర్వాత భర్త వల్ల జరిగితే raప్  కాకుండా పోదు. పెళ్లి చేసుకోవడమంటే జీవితాంతం un conditional గా భార్య/భర్త నా శరీరాన్ని నా ప్రమేయం లేకుండా ఎప్పుడైనా ఏమైనా చేసుకో అని చట్టబద్ధంగా అంగీకారమిచ్చినట్టు కాదు కదా. ఒప్పందం లేకుండా ఒక వ్యక్తి తన భార్య/భర్తతో లైంగిక సంభోగం చేయడం ( ఒప్పందం లేకపోవడం అనేది ముఖ్యమైన అంశం) శారీరక హింస మరియు లైంగిక దుర్వినియోగంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిని వైవాహిక అత్యాచారం. ( marital raప్) గా పరిగణించి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాయి.


భారతీయ శిక్షాస్మృతి లో ఏమంటోంది ? 


భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375 ప్రకారం, పురుషుడు స్త్రీ సమ్మతి లేకుండా లైంగిక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు, "raప్" అని చెప్పవచ్చు. అయితే, section 375 దీనికి రెండు exceptions ( మినహాయింపులు) ఇచ్చింది. మొదటిది మెడికల్ ప్రొసీజర్ అయితే రెండోది వివాహం. 


అంటే జీవిత భాగస్వామిపై అత్యాచారం చేయడం అనేది భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరం కాదు. కేవలం మహిళ వయస్సు 15 ఏళ్లకంటే తక్కువ ఉంటేనే నేరం అని చెప్తుంది. అక్టోబరు 2017లో, భార్య వయసు మెజారిటీ (18 ఏళ్లు) కంటే తక్కువ ఉంటే అత్యాచారంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. సమ్మతి కోసం భార్య వయస్సును 15 నుండి 18 సంవత్సరాలకు మార్చింది.  అంటే భార్య వయసు 18 సవత్సరాలు పైబడితే తన సమ్మతి అవసరం లేదు. 

irony ఏమంటే బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు అమ్మాయిని వివాహం చేసుకోకూడదు కాబట్టి, భార్య వయసు 18 ఏళ్లు పైబడితే సమ్మతి అవసరం లేదు కాబట్టి చట్ట ప్రకారం వైవాహిక అత్యాచారం అనేదొకటి లేనట్టే లెఖ్ఖ. 


వైవాహిక అత్యాచారాలు ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది పై వివిధ రూపాల్లో జరుగుతున్నా, ఆఫీసియల్ గా కేసులు నమోదు కాకపోవడం వల్ల, దీని గురించి ఎవరూ పెద్దగా మాట్లాడకపోవటం వల్ల భారత దేశ చట్టాల్లో ఎటువంటి మార్పులు రాలేదు. 


ఇప్పుడు ఎందుకు చర్చలోకొచ్చింది? 


2017 లో కర్ణాటక లో ఒక మహిళ తన భర్త పై హింస, అత్యాచారం కేసు వేసింది. సెశన్స్ కోర్టులో ఈ కేసు నడుస్తుండగానే, ఆ మహిళ భర్త సెక్షన్ 375 లో ఉన్న marital raప్ exception చూపించి తన మీద  చార్జ్ ని ఎత్తి వేయాల్సిందిగా కర్ణాటక హై కోర్టు లో పిటిషన్ వేసినడు. February 2022 లో ఈ పిటిషన్ను తిరస్కరించి, జె ఎస్ వర్మ కమిటీ సెక్షన్ 375 లో ఉన్న ఈ exception రిగ్రెసివ్ అనీ, సమానత్వ హక్కు ని కాలరాసేదిగా వుందనీ, భార్యను భర్త ఆధీనం లో వుంచేదిగా వుందని, దీన్ని తీసేయాలని సిఫార్సు చేసింది. The high court held, “No exception under law can be so absolute that it becomes a license for the commission of a crime against society “


అతను హై కోర్ట్ డెసిషన్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రయిస్తే, సుప్రీమ్ కోర్ట్ హైకోర్ట్ జడ్జ్మెంట్ మీద స్టే విధించింది. కర్ణాటక స్టేట్ మాత్రం హై కోర్ట్ డెసిషన్ ని సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదిలా నడుస్తుండగా, కొన్ని NGOs marital raప్ ఎక్స్సెప్షన్ ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేస్తే, దానిపై ఇద్దరు జడ్జ్ లు వ్యతిరేకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు, వాళ్లు సుప్రీమ్ కోర్ట్ కి పోవలసి వచ్చింది. 


ఈ కేసు పై ఇంకా హియరింగ్ పెండింగ్ లో ఉంది.  అయితే అక్టోబర్ 4, 2024 లో యూనియన్ గవర్నమెంట్ సెక్షన్ 375 లో marital raప్ ఎక్స్పషన్ ని తీసెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది.   ( అంటే వాళ్ల ఉద్దేశ్యం భర్త చేసే లైంగిక దాడి raప్ కిందకు రాదని) యూనియాన్ గవర్నమెంట్, భర్తకు భార్య ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే హక్కు లేదంటూనే, భార్య సమ్మతి లేని భర్త లైంగిక చర్యలను rape గా పరిగణించడం కఠినమైనదని అనింది. వివాహం అయినంత మాత్రాన మహిళ సమ్మతి కి విలువ లేకుండా పోదు అంటూనే, తన సమ్మతిని ఉల్లంఘించడాన్ని వివాహమైన వారి విషయం లో వేరేగా చూడాలి అనింది.   ఇంత కన్నా హైపోక్రసీ ఉంటుందా. 

(ఇట్లాంటి వాటి కోసం గృహ హింస చట్టం మీద ఆధారపడాలని అనింది. కానీ అది అంత సులభతరమైనది కాదు. ) 


ముఖ్యం గా ఈ ఎక్సెప్షన్ తీసేయడం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బ తింటుందని యూనియన్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. 


అత్యాచారం/ వైవాహిక అత్యాచారం పైన ఉన్న వ్యతిరేకత మీద పితృస్వామ్య వ్యవస్థ ప్రభావం ఉందా ? 


ఖచ్చితంగా పితృస్వామ్య వ్యవస్థ ప్రభావం ఉంది. ఎందుకంటే :


కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది, అవసరమైనది, అందరూ కాపాడవలసింది. దాన్ని కాపాడవలసిన బాధ్యత స్త్రీ పురుషులిద్దరి మీద ఉంది. అట్లాంటప్పుడు వైవాహిక అత్యాచారం లాంటి విషయాలు చర్చకొచ్చినప్పుడు కుటుంబ వ్యవస్థను ఒక సాకు గా చూపి ఆల్రెడీ బాధితురాలైన స్త్రీ మీద భారం ఎందుకు వేస్తారు? కుటుంబ వ్యవస్థను కాపాడటం కోసం స్త్రీ తన శరీరం పై ఉన్న హక్కును , స్వేచ్ఛను వదులుకోవాలని ఎందుకనుకుంటారు? కుటుంబ వ్యవస్థను కాపాడ్డం కోసం పురుషుడు వైవాహిక అత్యాచారాలు చెయ్యకూడదు అని నీతులు చెప్పొచ్చు కదా. భర్త అత్యాచారం చేస్తే కుటుంబం లో ముఖ్య వ్యక్తుల్లో ఒకరైన భార్యకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, కుటుంబ వ్యవస్థ విలువలు, గౌరవాన్ని నిలబెట్టి ఆ వ్యవస్థను కాపాడాలి కాబట్టి , వైవాహిక అత్యాచారాలు ఆపేందుకు అవి చేసిన వాళ్లపై శిక్షలు విధించాలని ఎందుకు ప్రతిపాదించరు? ఇవన్నీ చేయకుండా స్త్రీ మాత్రం త్యాగం చేసి ఎట్లైనా కుటుంబ వ్యవస్థను కాపాడాలనుకోవడం, వైవాహిక అత్యాచారం పైన తగినంత వ్యతిరేకత లేకపోవడం పితృస్వామ్య భావజాలం కాక ఇంకేమవుతుంది?


ఇంకా లోతుగా ఆలోచిస్తే, raప్ ని క్రూరమైనది గా ఖండించి, నిందితులపై కఠినమైన శిక్ష కోసం, బాధితురాలికి సత్వర న్యాయం కోసం ఉద్యమాలు కూడా చేసేవాళ్లు, మారిటల్ raప్ పై వ్యతిరేకత ఎందుకు చూపడ్డం లేదు. అది శిక్షార్హం కాదని ఎందుకనుకుంటున్నారు. దీని వెనుక కూడా పితృస్వామ్య భావజాలమే వుంది. వైవాహిక అత్యాచారం కిందికి రాని అత్యాచారాలు అంటే

ఒక పెళ్లి కానీ యువతి మీద జరిగేవి లేదా పెళ్ళైన యువతి మీద భర్త కాక వేరే పురుషుడు చేసేవి. 


కేవలం, పెళ్లికి ముందు స్త్రీ పవిత్రం గా ఉండాలి, పురుషుడు వివాహం చేసుకోబోయే స్త్రీ లైంగికం గా స్వచ్ఛం గా ఉండాలి, భార్య పవిత్రం గా వుండాలి అనే భావనతో బ్రెయిన్ వాష్ చేయబడ్డందువల్ల, raప్ మీద వుండే వ్యతిరేకత మారిటల్ raప్ మీద వుండదు. మెజారిటీకి నచ్చకపోయినా ఇది వాస్తవం. లేకపోతే ఒక స్త్రీ కి ఇష్టం లేకుండా బలవంతంగా చేసిన లైంగిక దాడి వేరే వాడు కాకుండా భర్త అనే మగవాడు చేసినంత మాత్రాన దాడి కాకుండా పోతుందా? హింస అవకుండా ఉంటుందా? 


పెళ్లైన స్త్రీ కి జరిగే భాధ, అవమానం పెళ్లి కానీ స్త్రీ కంటే తక్కువా? ఏదో స్విచ్ ఆన్ చేసినట్టు అంతా మమూలైపోతుందా ?అంటే స్త్రీ పై ఎట్లాంటి raప్, ఎవరు చేసే raప్ తప్పు అని ఆ స్త్రీ కాకుండా వేరే వాళ్లు నిర్ణయించడం 100% పురుషాధిక్య పితృస్వామ్య భావజాలమే. అట్ల కాకుండా ఒకవేళ నిజం గా స్త్రీ స్వయం ప్రతిపత్తినీ, స్త్రీ కి తన శరీరం మీద తనకున్న హక్కునూ రక్షించాలి అని సమాజం కోరుకున్నట్టయితే raప్ పైన చట్టం తెచ్చిన రోజే marital raప్ పైన కూడా చట్టం తెచ్చేవాళ్లు. ఇది జరగక పోవడమే కాకుండా, అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ 375 లో వివాహానికి ప్రత్యేకంగా మినహాయింపునిచ్చినరు. ఇప్పుడు ఈ మినహాయింపును తీసేయకూడదంటున్నారు


కొంచం ఆలోచించండి!!


మాలతి పల్లా

January 6, 2025

Highlight any text to reply to that part.

All Replies (2)

D
Excellent writeup Malathigaru.It's so frustrating and painful to see how societal norms and outdated beliefs still affect how we view a woman's autonomy, especially in marriage. The idea that marital rape is treated differently than any other form of rape is deeply rooted in patriarchy, and your words highlight this injustice so clearly.Your perspective is so powerful, and it's a necessary conversation.

Please log in to reply.

M
Thank you so much Devi garu.
Yes, I often find myself questioning what could be the sentiments behind agreeing rape illegal while illegalization of marital rape is so resisted.

It can't be to protect woman's autonomy and her right on her body. If that was the case, marital rape would have been made illegal the same day rape was.

It must be to protect woman’s modesty and chastity for her would be husband. Unfortunately, even the reasons for illegalization of rape is so patriarchal in India like any other religious countries.

Please log in to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026
I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026

New to Communities?

Join the community