ఇది నేను తెలుగులో అనువాదం చేసాను. ఒరిజినల్ లింక్ నిన్న టైం లైన్ లో పోస్ట్ చేసాను.
రాఖీఘడి వనిత: భారత ప్రజానీకం
రాఖీఘడి అస్థిపంజర అవశేషాలపై జరిగిన జన్యు పరిశోధనలు చివరకు ప్రచురించబడ్డాయి. ఈ రెండు పేపర్ల లింక్ కింద ఇవ్వబడింది:
https://science.sciencemag.org/content/365/6457/eaat7487.full వాగీష్ నరసింహన్ పేపర్
https://www.cell.com/cell/fulltext/S0092-8674(19)30967-5 షిండే పేపర్
ఈ పరిశోధనల సారాంశం తో భారత దేశం లో వలసల కథను వివరించే ప్రయత్నం. (ముందుగా గుర్తించాల్సింది రాఖీఘడి లో దొరికిన అనేక అవశేషాల్లో జన్యు పరిశోధనకు పనికి వచ్చే ఒక్క స్త్రీ అస్థిపంజరం ఆధారంగా వచ్చినదని. అప్పటికే హరప్పా నాగరికత నగర సంస్కృతీకరించబడి కాస్మోపోలిటన్ చెందిన ప్రదేశం. ఈ వనిత ఎక్కడి నుండైనా పట్టణ ప్రాంతానికి వలస వచ్చి ఉండొచ్చు). ఈ జఠిల సమస్య ను ఒక్కొక్కటిగా చూద్దాం:
1. మొదటి చిక్కుముడి టోబా లావా విస్ఫోటనం ముందు:
టోబా అగ్ని పర్వత విస్ఫోటనం ముందు భారత భూ భాగం లోకి వలస జరిగి ఉండొచ్చు. కానీ ఈ వలసలకు జన్యు సాక్ష్యాలు ఏవి పెద్దగా కనబడవు.
Professor Korisettar ఈ విషయాన్ని నమ్మరు. ఆయన రాతి పనిముట్లను జ్వాలాపురం టోబా బూడిద కింద నుండి పై నుండి కూడా వెలికి తీశారు. మధ్య పూర్వ శిలా యుగం లో జ్వాలాపురం బూడిద నిక్షేపాల కింద దొరికినవి 77,000 ఏళ్ళవి, పైన దొరికినవి 35,000 ఏళ్ళవి. మానవ అవశేషాలు లేకుండా వీటి ని నిర్ధారించడం చాలా కష్టమైనా విషయం. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మానవ సంతతి ఈ టోబా విస్ఫోటనం తప్పించుకోగలిగిన వారి సంఖ్య చాలా కొంచెం అయ్యుండడం పైగా మన ప్రాచీనులు వారి దారి వెతుక్కుంటూ రావడం వల్ల కూడా వీరి తాలూకు జన్యు చారిత్రిక అవశేషాలు లేనట్టుగానే చెప్పొచ్చు.
2. రెండవ చిక్కుముడి టోబా విస్ఫోటనం తర్వాత:
టోబా ప్రళయం తర్వాత ముఖ్యమైన వలసలు ఆఫ్రికా ఖండం నుంచి జరిగాయి. దీనిని మహా తీరా ప్రాంత వలసగా చెప్పుకోవచ్చు. ఈ మానవ సమూహాలు తూర్పు ఆఫ్రికా నుండి బయల్దేరి దక్షిణ ఎర్ర సముద్రం లోని ఒక ఇరుకైన జల సంధి (బాబ్ ఎల్-మండెబ్) ను దాటి వచ్చి ఉంటారు. ఒక సారి ఎర్ర సముద్రం దాటిన తర్వాత త్వరగా హిందూ మహా సముద్రం తీరం వెంబడి ఆగ్నేయ ఆసియ చేరుకున్నారు. ఈ వలస వారు ఒక్క ప్రయాణం తో పూర్తీ చెయ్యలేదు. చిన్న చిన్న గమ్యాలను దాటుతూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం కు చేరుతూ కొన్ని తరాలు కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగించారు.
చివరి హిమ కాలం లో ఖండాతర్భాగం లో చలి విపరీతంగా ఉండడం వల్ల వారు తీర ప్రాంతం వెంబడి ప్రయాణించడానికి ప్రధానంగా మొగ్గు చూపారు. పర్యావరణం లో వేడి పెరగగానే వారు నది తీర ప్రాంతాలను అనుసరిస్తూ ఖండాంతర్భాగాల్లోకి వలస పోవడం మొదలు పెట్టారు. అప్పటి ఈ అధునాతన ఆఫ్రికన్ మానవ సమూహం భారత మొదటి తరం మానవులను ప్రతిక్షేపించారు. వీరిలో సాహోసోపేతమైన కొంత మంది తమ సహచరులు తీర ప్రాంతం గుండా తరలిపోతుంటే వారిని వదిలి హిమాలయా మార్గం గుండా భారత భూ ఖండం పై అడుగు పెట్టారు. ఈ కొత్త భారత సమూహం (వీరిని మనం ప్రధమ భారతీయులు ‘early Indians’ అందాం, వీరికి ముందున్న వార్ని అసలు భారతీయులు అనుకుంటూ) వారసులు కొందరు ఆగ్నేయ ఆసియ వైపు వలస లు చేపట్టారు.
జన్యు డేటా పరిశోధన వల్ల మనకు తెలిసిందేంటంటే ఇప్పుడున్న భారతీయుల్లో 70 to 90 మంది తమ mtDNA haplogroup ను ‘early Indians’ తో షేర్ చేసుకుంటారు. mtDNA మైటోఖండ్రియా ద్వారా అది కూడా తల్లి ద్వారా వస్తుంది. అంటే మాతృవరస క్రమాన్ని మాత్రమే చూపిస్తుంది ఎందుకంటే ఈ మగ వారు ఈ DNA ను బదిలీ చెయ్యలేరు (కొన్ని అతి అరుదైన కేసుల్లో మినహాయిస్తే). ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం 10 నుంచి 40 శాతం Y-chromosome haplogroup మాత్రమే ‘early Indians’ నుండి వచ్చింది. అండమాన్ తెగలు ఇటువంటి సమూహాలకు చాలా దగ్గరగా ఉంటారు. మన జీన్ పూల్ పై తర్వాతి వలసల ప్రభావం మగ వారి వల్ల కనబడుతుంది.
3. మూడవ చిక్కుముడి హరప్పా కు ముందు:
చివరి హిమ యుగం 29,000 నుండి 14,000 ఏళ్ల వరకు ఉంది. ఈ హిమ యుగపు పొడి చలి మనుషుల్ని చాలా వరకు గుహలకు పరిమితం చేసింది. ఈ స్థితి నుంచి హిమ యుగాంతం తర్వాత మనుషులు గుహలను వదిలి బయటకు వచ్చి వెచ్చదనం తో పాటు కొత్త సవాళ్ళను ఎదుర్కొవలసి వచ్చింది. భూమి వేడెక్కడం తో పాటు ఈ హంటర్స్ గాథేరేర్స్ ను తాత్కాలిక నిశ్చల జీవన విధానం తో పాటుగా వ్యవసాయ దారులుగా కూడా మార్చింది. దీనినే మనం నూతన శిలా విప్లవం (నియోలిథిక్ రెవల్యూషన్) గా పిలుచుకుంటాం.
కొత్త పరిశోధనల వలన 12000 ఏళ్ల క్రితం ఇరాన్ వైపునుంచి పశ్చిమ భారతానికి హంటర్ గాథేరేర్స్ రెండవ వలస ప్రారంభం అయ్యింది (అయితే ఇలాంటి వలసలు చాలా జరిగి ఉండొచ్చు కానీ జెనెటిక్ గా వాటి ఇంప్రింట్స్ దొరక్క పోవొచ్చు). ఇది వ్యవసాయ ఆవిర్భావానికి ముందు. ఈ కొత్త వలస గాళ్ళు స్థానికులతో మమేకమై వ్యవసాయాన్ని కనిపెట్టి ఉండొచ్చు. ఈ మిశ్రమమే హరప్పన్ నాగరికత నిర్మాతలు.
వ్యవసాయం ఉత్తర మధ్య భారతం లో ముందుగానే ప్రారంభం అయ్యిందనే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇది 2006 లో యూపీ లో రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన లహురదేవ దిబ్బ కింద తవ్వకాల్లో తెలిసింది. ఈ దిబ్బ స్థానిక దేవత సామై మాయి కి చెందినదిగా భావిస్తారు. ఈ దేవత వారికి మంచి పంటలను అందించడం లో సహాయం చేస్తుంది అని నమ్ముతారు. తవ్వకాల్లో 9000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభం అయ్యిందని తెలిసింది. ఈ రోజుకు ఇక్కడ వరి ప్రముఖ్యంగా పండిస్తారు. ఇక్కడే కాకుండా మెహ్రగర్హ్ లో కూడా వ్యవసాయం ప్రారంభం అయ్యింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే అవి స్వతంత్రంగా ప్రారంభమై ఉండొచ్చు. ఈ మొదటి వ్యవసాయ దారులు వలస వ్యవసాయ విధానాన్ని పాటించే వారు, ఇప్పటి ఈశాన్య, ఒడిశా, ఎంపీ ల లో కొన్ని తెగలు పాటించే పద్ధతుల్లో.
హరప్పన్ నాగరికత అంతం తర్వాత ఈ ప్రజలు దక్షిణానికి తూర్పు కు వలసలు వెళ్లి అక్కడి స్థానికులతో మమేకమవ్వడం ప్రారంభించారు. ఈ సమూహమే పురాతన దక్షిణ భారత జెనిటిక్ పూల్ (Ancestral South Indian group, or ASI).
4. నాల్గవ చిక్కుముడి హరప్పా తర్వాత:
ఏ నాగరికత నిరంతరం పెరుగుతూ పోలేదు. ప్రతి నాగరికత లోను దాని బలహీనతలు అంతర్లీనంగా ఉంటాయి. హరప్పన్ నాగరికత లో చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఋతుపనాలపై, వర్తకం పై ఆధార పడడం. 9000 ఏళ్ల క్రితం మెహ్రగర్హ్, బిఱ్ఱన, రాఖీఘడి లాంటి చోట్లా విత్తబడిన నాగరికత పరిపూర్ణ స్థితి కి చేరుకోడం మొదలయ్యింది. ఋతు పవనాల అగమనాల్లో అనూహ్యత, ప్రధాన వర్తక భాగస్వామి మిసోపోటమియా పతనం లాంటి బీటలు వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా వల్ల పెద్ద పెద్ద పగుళ్లుగా మారడం మొదలయ్యింది. సింధు నాగతిక ను ఒక విఫల యత్నంగా చూడలేం. ఇది కొన్ని వేల ఏళ్ళు వర్ధిల్లింది. మొదటి హారప్పన్ నాగరికత 7500 నుండి 4600 సంవత్సరాల మధ్య నడిచింది. 4600 నుండి 3900 సంవత్సరాల మధ్య దీని ఉచ్ఛ స్థితిగా పరిగణించవచ్చు. దీనికి ప్రతీకగా కలిబంగాన్, బనవాలి, రెహ్మాన్ థేరి లాంటి పట్టణాలను చూడొచ్చు. చివరి హారప్పన్ స్టేజి 3900 నుండి 3300 సంవర్సరాల వరకు ఉంది. నదులు ఎండి పోవడం, తమ దారి మార్చుకోవడం, సార్గోనిక్ ఆక్రమణల తరవాత ప్రధాన వర్తక భాగస్వామి మిసోపోటమియా పతనం ఈ కాలంలో జరగ సాగాయి. ఈ పతన సమయం లోనే బీడ్స్ కు షెల్స్ గిరాకీ పడిపోవడం మొదలయ్యింది. ఈ చివరి దశ హారప్పన్ సైట్స్ లో ఒకటైన ఛాన్హు దారో (పాకిస్తాన్ సింధ్ లోని) లో అసంపూర్ణంగా తయారు చేయబడిన వందల long-barrel carnelian beads దొరికాయి. ఒకప్పుడు అతి విలువైన, ఆర్ధిక వ్యవస్థ కు ఊతమైన ఈ బీడ్స్ తమ విలువను ఆకస్మికంగా పోగొట్టుకోడం జరిగింది. మొహెంజదారో లో డెడ్ మాన్ వీధిగా పేరుగాంచిన సందులో దొరికిన అస్థిపంజరం, చాలా సైట్స్ పూర్తి పరిత్యజన కు గురి అవ్వడం హారప్పన్ నాగరికత పై తీవ్ర వత్తిడిని మొత్తం జన జీవనం అస్తవ్యస్తం అవ్వడాన్ని సూచిస్తోంది.
2016 లో డా. అనింద్య సర్కార్ నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించిన పేపర్లో ఋతుపవనాలు సుమారు 7000 సంవత్సరాల నుండి విఫలమౌతున్నాయని ప్రతిపాదించారు. అయినప్పటికీ తర్వాతీ 3000 ఏళ్ళ పాటు హారప్పన్ నాగరికత కొనసాగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి కూడా జరిగింది. గోధుమ, బార్లీ లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా వరి, చిరుధాన్యాలు పండించడం మొదలుపెట్టారు. కేంద్రీయ నిల్వలు ప్రోసెస్సింగ్ నుండి వ్యక్తుల ఇళ్లకు నిల్వలు మారడం మొదలయ్యింది. ఇవన్నీ వారు మార్పుకు అనుగుణంగా మలుచుకోగలగడం చూడొచ్చు. డా. సర్కార్ ఈ మార్పులను పట్టణీకరణ తిరోగమనం గా పేర్కొన్నారు. పట్టణీకరణ వికేంద్రీకరణ వలన పశ్చిమ పట్టణాలు పరిత్యజించబడ్డాయి. ప్రజలు తూర్పు వైపు వలస పోవడం మొదలు పెట్టారు. గంగ మైదాన ప్రాంత ప్రజలతో వారి సంస్కృతి తో పని విధానాలతో మమేకం అవ్వడం మొదలు పెట్టారు. సాహసోపేతమైన పట్టణ జీవన శైలి నుంచి వ్యవసాయ జీవన విధానం వైపు మళ్లడం మొదలు పెట్టారు. మిగిలిన భారత ప్రజలతో మమేకమవుతూ తమ యాత్రను కొనసాగించారు.
రాఖీఘడి లో దొరికిన వనిత అస్థిపంజరం 4000 సంవత్సరాల క్రితం జీవించింది. ఆమె జన్యువులలో ఒక ప్రత్యేక R1a1 అనబడే DNA లేదు. ఇది లేకపోడంలో ప్రత్యేకత ఏముంది? ఈ జన్యువే ANI ప్రజలలో ఎక్కువుగా కనిపిస్తుంది. ఇది నల్ల సముద్రం, కాస్పియన్ ల మధ్య మైదానాల్లోని మధ్య ఆసియ లోని పొంటిక్ స్టేప్పే ప్రాంత పాస్టరల్ ప్రజలలో ఉండేది. ఇది ఆధునిక ఉత్తర భారతీయులలో ఎక్కువుగా కనిపిస్తుంది. ఈ జన్యువు రాఖీఘడి వనితలో లేకపోవడం, తర్వాతి ప్రజలలో ఉండడం హారప్పన్ నాగరికత తర్వాతి స్టేప్పే ప్రాంతం నుండి వలసలను తెలుపుతుంది.
5. ఐదవ చిక్కుముడి ముండ మిస్టరీ
ఇది అస్ట్రో-ఆసియాటిక్ సమూహానికి సంబంధించినది. ఈ సమూహపు భాషను మాట్లాడే వారు ఇండియా లోను ఆగేయా ఆసియ లోను ఉన్నారు. ఇండియన్స్ ఆగ్నేయ ఆసియన్లకు ఏమిటి సంభంధం? సుమారు 11.7 కోట్ల మంది ఈ భాషను మాట్లాడతారు. అండమాన్-నికోబార్, చోట నాగపూర్ (ముండ), ఈశాన్య భారతంలో వీరు కనిపిస్తారు. వీరి భాష ఆర్యన్, ద్రావిడియన్ భాషాలకన్న చాలా భిన్నమైనది. జన్యుపరంగా అస్ట్రో-ఆసియాటిక్ సమూహం Y-క్రోమోజోమ్ (O2a1-M95) వారసత్వం ద్వారా గుర్తించవొచ్చు. వీరు బంగాళాఖాతానికి ఇరువైపుల ఉన్నారు. రెండు విధాలుగా వీరి ఈ ఉనికిని అర్ధం చేసుకోవొచ్చు. ఇండియా లో పుట్టి తర్వాత ఆగ్నేయ ఆసియ, ఆస్ట్రేలియా వైపు వలస వెళ్లడం. లేదా మహాతీర ప్రాంత వలసలలో భాగంగా ఆగ్నేయ ఆసియ 20-40000 ఏళ్ల క్రితం ఆగ్నేయ ఆసియ చేరిన వీరు 10000 సంవత్సరాల క్రితం (చివరి హిమ యుగం తర్వాత) తిరిగి ఇండియా లోకి వలస రావడం. కొన్ని పరిశోధనలు 4000 ఏళ్ల క్రితం వలసలు జరిగినట్లుగా కూడా పేర్కొన్నాయి. వీటిలో మనం ఏది నమ్మిన మనకు ఆగ్నేయ ఆసియన్లకు మధ్యగల అనాది గా ఉన్న అవినావభావ సంబంధాన్ని కాదనలేం. ఈ సంభంధం ఆధునిక యుగంలో కూడా కొనసాగుతుంది.
6. ఆరవ చిక్కుముడి ఆధునిక ఇండియన్లు
ఆధునిక భారతీయులు ANI, ASI ల మిశ్రమం, ANI ఉత్తర భారతంలో, ASI దక్షిణ భారతంలో. మనం ఈదేశంలో జరిగిన అనేక వలసల మిశ్రమం. మన జన్యు పవిత్రతను క్లెయిమ్ చేసుకోలేని స్థితి. స్వతంత్రంగా ఈ సమూహల జన్యు మిశ్రమం కలకాలం కొనసాగలేదు. 2100 సంవత్సరాల క్రితం కుల వ్యవస్థ ఏర్పడి ఎండోగామీ (అంతర్వివాహలకు) దారి తీసింది. గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇదే సమయంలో శాక దండ యాత్ర జరిగింది. దీని తర్వాత కుశనుల దాడి.
భిన్న సముదాయాలు, భిన్న కాలాలలో ఇండియా లోకి పశ్చిమం నుంచి, తూర్పు నుంచి వలస వచ్చాయి. ఆర్యుల భాష ఇండియా లో పుట్టి బయటకు వెళ్లిందా లేదా బయటినుండి ఇక్కడకు వచ్చిందా అనేది వివాదాస్పద అంశం కావొచ్చు. కానీ మన జన్యువులలో భిన్నత్వం, మిశ్రమం కాదు. భారత ఎదుగుదల లో భిన్న సంస్కృతుల మిశ్రమం ప్రముఖ పాత్ర వహించింది. భారత దేశం భిన్న సంస్కృతుల జ్ఞానాన్ని కలుపుకుంటు తనకంటూ ఒక ప్రత్యేక జ్ఞానంతో జ్ఞాన ప్రపంచానికి వెలుగునిచ్చింది. ఇండియా, ఇరాన్ పురాణాల్లోని సారూప్యాన్ని మనం చూడొచ్చు. మన అసుర వారి ఆహురా. వైదికుల శత్రువు జొరష్ట్రియన్ల దేవుడు. దేవాస్ (Daevas) వారికి శత్రువులు. దేవాస్ అంటే ప్రకాశించేవారు అని అర్ధం. తర్వాతి కాలంలో వారు చిన్న దేవుళ్లుగా శత్రువులుగా పరిగణించబడ్డారు. ఆంగ్లం లో దేవాస్ అన్న పదమే డెవిల్ అన్న పదానికి మూలం.
ఇండియా అంటే అనేక సాంస్కృతిక, జన్యువుల మార్పిళ్లకు వేదిక. ఈ దేశంలోని ఇన్ని రంగుల భిన్నత్వానికి మూల కారణం. ఈ భిన్నత్వమే మనందరికీ గర్వ కారణం, మనం కలిసి కాపాడుకోవాల్సిన వారసత్వపు ఆస్తి.