S
:

యుద్ధం లో పిల్లలు

Author Name: Srinivas Maddali
MISCELLANEOUS TOPICS/POETRY


నన్ను స్కూలు కి పంపించమ్మా

*******************************

అమ్మా ఎప్పటి వరకు

నను దాపెడతావ్

ఈ చీకటి గదిలో

ఉక్కిరిబిక్కిరి అవుతుందే

అమ్మా నన్ను స్కూలుకు పంపే

ఎప్పుడే ఈ మోతలు తగ్గేది

చెవి లో ఉబ్బు అయి నెట్టురోస్తోందే

డాం డాం అని ఎందుకే ఈ మోతలొస్తున్నాయి

ఆ బుచోడు మళ్ళీ వస్తాడేమో 

నన్ను స్కూలుకు పంపే

అక్కని పట్టుకుని పోయినాడు

నన్నూ పట్టుకు పోతాడేమో

భయమేస్తోందే 

వాడొస్తే అక్కని మళ్ళీ నాకిచ్చెయ్ మని చెప్పవే

అమ్మా నాకు ఆదుకోవటానికి అక్క కావాలే

అమ్మా ప్లీజ్ .... నాన్నని దేవుడి దగ్గరకి పంపారన్నావ్

అక్కని వాళ్ళు తీసుకుపోయారు

నాకు తోడెవ్వరే

నన్ను దేవుడి దగ్గరకి పంపమని చెప్పవే

మనము వెళ్ళి పోదామమ్మ

నాకు ఇక్కడ భయమేస్తోంది

నువ్వు బబ్బో మంటావ్ గానీ

నాకు నిద్దాయి రావట్లే

ఏవో మోతలు బయ్యి బయ్యి మని 

చెవులు చిల్లులు పెడుతుంటే 

ఎలా బబ్బోనే 

అమ్మా నన్ను రేపు స్కూలుకు పంపే

నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటా

మా టీచర్ బోల్డు విషయాలు చెబుతుంది

మాకు గేమ్స్ కూడా ఉంటాయ్

అయినా ఆ బూచోళ్ళు నా టీచర్ నీ

ఫ్రెండ్స్ నీ పట్టుకు పోయారో ఏమో 

రేపు నన్ను పట్టుకు పోతాడేమో

అమ్మా నన్ను దేవుడి దగ్గరకు పంపేమని చెప్పు

నాన్నని చూడాలి

లేకుంటే అక్కనిచ్చెయ్ మని చెప్పు

ఆడుకోవాలి 

స్కులకన్న పంపే

ఫ్రెండ్స్ తో ఆదుకోవాలి

అమ్మా ప్లీజ్ 




All Replies

New to Communities?

Join the community