*యుద్దమా మా పసి జీవితాలకు శాపమా......*
అధికారం కోసం మీ పోరాటం,
మా జీవితాలు అమ్మ నాన్నలకై ఆరాటం....
మతాల కోసం మీ పోరాటం,
మానవత్వమే లేకుండా మమ్మల్ని అనాథలుగా మార్చే సంస్కారం...
కులాల కోసం మీ పోరాటం,
కూడుగుడ్డలు లేక అల్లాడుతున్న మా అవసరాలు....
సరిహద్దులు కోసం మీ పోరాటం,
సరిద్ధిద లేని తప్పుగా మారుతున్న మా జీవితాలు..
సముద్ర అలలకి ఎక్కడవి సరిహద్దులు...
స్వేచ్ఛగ ఎగిరే పక్షులకి ఎక్కడివి సరిహద్దులు....
నడిచే మేఘం నీదా నాద, కురిసే వానకి ఎక్కడవి సరిహద్దులు...
కారుచిచ్చుని ఆపగలవా మీ కాపలాల సరిహద్దులు
*ప్రకృతికి లేదు ఈ వివక్ష...*
ఎందుకు మా జీవితాల మీద మీకు ఈ కక్ష....
బాంబుల దాడులా మీ సరిహద్దులకి రక్ష.....
*మా బాల్య జీవితాలకు వేయకండి శిక్ష.......*
రామారావు గల్లా