ఆరుబయట ఆడుకోవలసిన పసి ప్రాణాలు
తమని ఆదుకునే వారి కోసం అలుపెరుగని ఆర్తనాదాలు చేస్తున్నాయి…
పాలు త్రాగి పడుకొవలసిన చిన్నారులు
చెవులు చిల్లులు పడే వైమానిక విస్పోటనాలలో విగతజీవులుగా నేలపై ఒరిగి శాస్వత నిద్రలోకి చేరుకున్నాయి…
గాలి తరంగాలతో పొటీపడి పతంగులను ఎగురవేసే పసిడి పాదాలు
నేలపై దారాళంగా ప్రవహిస్తున్న రక్తపుటేరులలో నడవడానికి భయపడుతున్నాయి…
పాఠశాలలో విధ్యనభ్యసించవలసిన దేశపు భావితరాల తలరాతలు తుపాకీల గుళ్ళకు ఛిద్రమైయాయి…
చిన్నారుల లాస్యాలతో ఉల్లాసభరితంగా ఉండవలసిన నివాసాలు స్మశానాలలో సమాధులుగా మౌనం అందుకున్నాయి…
లోకం తెలియని పసి హృదయాల అడుగులు నిర్జీవులుగా పడిన వారి ఆప్తుల దేహాల ముందు దీనంగా దేహీ అంటూ మోకరిల్లాయి…
అమ్మ ఒడిలో నిద్రపోవలసిన చిన్నారుల జీవితాలు
యుద్ధ భూమిలో చేరి సొంత దేశంలో శరణార్థులుగా సమిధలైయ్యాయి.