A Call for Critical Reflection- Reassessing Our Priorities:
మన సొసైటీలో యాక్టర్, యాక్ట్రెస్ మీద ఉన్న అభిమానం అభిమానుల మానసిక బలహీనతకి అద్దం పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళని ఓన్ చేసుకోవడం మొదలుపెదాతమో వాస్తవికతను కోల్పోతాం.అభిమానుల మధ్య వాగ్వాదము అనారోగ్యకరమైన వాతావరణాన్ని స్ట్రష్టిస్తాయి.ఇతరులకు బానిసలుగా ఉంటూనే.. నేను(మేము) ప్రత్యేకం అనే ఊహలలో మునిగిపోతున్నారు.
ఆ ప్రత్యేకతను చాటుకోవడం కోసం , ఎంతకైనా దిగజారుతున్నారు . ఆ ప్రత్యేకతలో తాము ఏమి కోల్పోతున్నారో గుర్తించలేని బానిసత్వంలో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ అభిమానానికి కుల గుర్తింపుతో పెనవేసినపుడు అభిమానం అనేది ఉన్మాదానికి దారి తీస్తుంది. అదే తర్వాత తర్వాత తీవ్రవాదాన్ని స్ట్రష్టిస్తుంది.
కొన్ని సంవత్సరాలుగా వినోదం అనేది సామజిక గణనియమైన పురోగతి చూడలేదు. ఎంతోమంది నటి నటులు, చిత్ర నిర్మాతలు కీర్తిని కూడగంటుకున్నపుడు వారిని ఇంత అభిమానంతో ఆదరిస్తున్న సమాజానికి న్యాయంగా సహకరిస్తున్నారా?? చాలా మంది దక్షణ భారత చలన చిత్ర ప్రముఖులు -దర్శకులు, నిర్మాతలతో పాటు అధికమైన పారితోషకాన్ని ఆశిస్తారు. అయినప్పటికి టాక్స్ సకాలంలో కట్టని వాళ్లే ఎక్కువమంది ఉంటారు. ఇది చట్టపరంగా అనైతికమైనది.
ఈ చిత్ర పరిశ్రమకి కులం, మతం, రాజకీయం సాధనయుధాలుగా తయారయ్యాయి. ప్రజానీకాన్ని తరుమారు చేయడం లో మీడియా ని ఒక మాద్యమంల వినియోగిస్తునారు.నిజానికి విద్యావంతులే ఈ రాజకీయ, వ్యక్తిగత అణిచివేత దూషణలకి పాల్పడుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం తోనే అవగాహనా లేకుండా గుడ్డి విధేయతను చూపిస్తున్నారు.
అభిమానం అనేది ఏ పార్టీకి, ప్రముఖులకు లేదా వారి భావజాలానికి గుడ్డిగా మద్దతు ఇవ్వకపోవడం చాలా అవసరం. విమర్శనాత్మక ఆలోచనను పెంచుకోవడం ద్వారా, కాలం చెల్లిన నమ్మకాలు మరియు విభజన రాజకీయాలతో మనల్ని బంధించే అనారోగ్య సంబంధాలను మనం కూకటి వేళ్ళతో సహా కూల్చివేయవచ్చు.
ఇది సూటిగా చేసే విమర్శ కాదు.ఇది ఆత్మపరిశీలన, పరివర్తన కోసం హృదయపూర్వక విజ్ఞప్తి. మన భావోద్వేగాలు మన చర్యలను నిర్దేశించేలా బానిసత్వాన్ని కూడగట్టుకోవద్దు. బదులుగా, ఆలోచనాత్మకత, సమానత్వం, నిజమైన పురోగతికి విలువ ఇచ్చే సమాజం కోసం కృషి చేస్తే ఈ గుడ్డి విధేయత యొక్క గొలుసుల నుండి విముక్తి పొందవచ్చు. మన సామూహిక భవిష్యత్తును పునర్నిర్మించవచ్చు.
అలకనంద
9/12/24