V
P:

Perelman logic

Author Name: Virinchi Virivinti
SCIENCE/BASIC SCIENCE

"ఒక గొప్ప పనిని చేయాలంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి. అపుడు నీవు మాథమేటిక్స్ గురించి ఆలోచించినది మాత్రమే అసలైన ఆలోచన. మిగిలినదంతా మనిషి బలహీనత. ఒక ప్రైజ్ ని ఒప్పుకున్నావంటే నీ బలహీనతను నీవు వ్యక్తపరుచుకోవడమే".

 

                 ఇది Perelman's logic.

 

ఒక చిన్న పని చేసి తాము మాత్రమే చేస్తున్నట్టు తమ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పదైనట్టు ఒకటికి పదిసార్లు చెప్పుకుంటూ తమను తాము సెల్ఫ్ ప్రమోట్ చేసుకునేవాళ్ళను తరచు చూస్తూనే ఉంటాం. ప్రపంచంలో వీళ్ళంతా ఒకవైపు ఉంటారు. గుర్తింపు కోసం పాకులాట , identity crisis, అవార్డులకోసం దేబిరింపులతో, వార్తలలోని వ్యక్తులుగా ప్రముఖులుగా ఉండాలని తాపత్రయ పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఒకవైపు ఉంటే, మరోవైపు వీటికన్నింటికీ దూరంగా మౌనంగా తమ పనేదో తాము చేసుకుంటూ పోవడమే కాక అన్ని పటోటాపాలకు దూరంగా ప్రశాంతంగా తమదైన జీవితాలనునిండుగా జీవించేవారూ ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తి రష్యన్ మాథెమెటీషియన్ గ్రిగోరి పెర్ల్మన్. 

 

గణితశాస్త్రంలోని జియోమెట్రిలో మహామహులైన గణితశాస్త్రజ్ఞులంతా జుట్టు పీక్కుంటున్న అంశం poincare conjecture అనే సమస్యను ఇతడు పరిష్కరించాడు. 2002 -2003 కాలంలో అతడు ఆన్లైన్ లో రాసిన పేపర్లు గణితశాస్త్రంలో వణుకు పుట్టించాయి. గణిత శాస్త్రవేత్తలను అబ్బురపరచాయి. వారంతా గణిత శాస్త్రం లో ఇదొక విప్లవాత్మకమైన అంశంగా పేర్కొన్నారు. అతడి ఆన్లైన్ పేపర్లు ఏమిటీ కుర్రాడు ?. ఎలా సాధ్యం ఇతనికి!?. అని ముక్కున వేలేసుకునేలా చేశాయి. ఇంటర్నెట్ ని కేవలం మంచికి మాత్రమే, జ్జాన విస్తృతికి మాత్రమే ఉపయోగించే ఇటువంటి వారు ఇపుడెందరున్నారు?. 

 

అతడేమీ తన పరిశోధనలను గణితశాస్త్ర జర్నల్స్ లో కూడా పబ్లిష్ చేయలేదు. కానీ ఈ సమస్యపై పని చేస్తున్నప్రపంచ వ్యప్త గణితశాస్రజ్ఞులు మాత్రం ఈ ఆన్లైన్ పేపర్లను చూసి అబ్బురపడ్డారు. ఈ అంశంపై అతడు కనబరిచిన నేర్పుకు గుర్తుగా గణితంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే Fields Medal ని ఇతడికిద్దామనుకున్నారు. అతడు తిరస్కరించాడు. గణితశాస్త్రంలో Millemium prize problem అన తగ్గ ఈ Poincare conjucture సమస్యను పరిష్కరిస్తే మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించిన Clay Mathematics Institute కూడా ఇతడి గణితశాస్త్ర శక్తిని గుర్తించి మిలియన్ డాలర్లు బహూకరిస్తామని ముందుకు వస్తే దానినీ తిరస్కరించాడు. అతడు సాధించిన ఘనతను చూసి అమెరికా యూనివర్సిటీ లు గెస్ట్ లెక్చర్ ఇవ్వమంటే వెళ్ళాడు. ఆ టూర్ లో ఒక అమెరికన్ జర్నలిస్టు ఏ ప్రశ్న అడిగాడో తెలుసా?. మీ గోళ్ళు అంత పెద్దగా ఉన్నాయెందుకు ఆని?. ఎవరిని ఏ ప్రశ్నలడగాలో తెలియని పత్రికా జర్నలిస్టులు, సెన్షేషనలిజం ని మాత్రమే కోరుకునే ప్రజలు. వీరినుండి ఇంకేమి ఆశించేది లేదని అతడు రష్యాకు వెళ్ళిపోయాడు.

 

అతడు introvert అని అందరూ అనుకున్నారు. కానీ కొంతమంది పేరుకోసం పాకులాడే చీనీ గణితజ్ఞులను చూసి అతడు విసుగుచెందాడు. ఒక తనకు తానుగా ఉండాలనుకునే వ్యక్తి. ఈ ప్రైజ్ లకూ, వీటి ఝంఝాటాలకూ దూరంగా ఉండాలనుకునే వ్యక్తి. పేరునీ డబ్బునీ తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి. చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడే వ్యక్తి. "నేను గణితాన్ని గణితంకోసం మాత్రమే చేస్తాను. అంతేతప్ప ఏదో గుర్తింపుకోసమో లేక డబ్బుకోసమో కాదు " అనేస్తాడు. శాస్త్రం విషయంలో కాంపిటీషన్ , వ్యక్తిగత గుర్తింపుకోసం పాకులాట వంటి కల్చర్ కి తాను దూరంగా ఉండేందుకు ఇష్టపడుతాడు. గణిత శాస్త్రమే కానీ మరే శాస్త్రమే కానీ ఒకరితో ఒకరు సహకరించుకోవడం వల్లనే తప్ప ఒకరు నిర్మించిన పునాదు‌లపై మరొకరు నిర్మించబడం జరుగుతుందే తప్ప ఒక వ్యక్తే అంతా చేసేసాడనుకునే వ్యక్తి పూజలకు, intellectul dishonesty లకు అతడు దూరంగా జరిగాడు. 

 

ఇపుడతడు రష్యాలో తన తల్లితో ఒక అపార్ట్మెంట్ లో సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు ప్రపంచానికి కూడా పెద్దగా కనబడడు. ఒకరిద్దరు జర్నలిస్టులకు అతడిచ్చిన ఇంటర్వూలు తప్ప అతడి గురించి మనకు పెద్దగా తెలిసే అవకాశం కూడా లేదు. ప్రపంచంలో చిన్న పనిచేసి తమ ప్రాపకంవలననే అనుకునే పేలపిండి కృష్ణార్పణమనుకునే లోతులేని మనుషులు ఒకవైపుంటే అంతా తామే చేసి కూడా తాము నిమిత్తమాత్రులమని సాధారణంగా జీవించే మహనీయులూ ఉన్నారు. నిజమైన గురువులంటే వీరే. నిశ్శబ్దంగా తమపని తాము చేసుకుంటూ పోతుండేవారే.! 

 

Happy π day????????????

March 14th 2023.

 

విరించి విరివింటి

All Replies

S

Sir, poincare conjecture గురించి కొంత వివరిస్తే బాగుండేది

Please log in to reply.

V

Yes.
I think I wrote long back only to make the importance of staying silent and having one's own business

Please log in to reply.

New to Communities?

Join the community