యుద్ధo లో పిల్లలు
ఎవరి కోసం యుద్ధాలు,దేని కోసం యుద్ధాలు?
ఎవరు ఎవరి మీద గెలుస్తారు
చితి మీద కాలే శవాల మీదా?
తల్లి ఒడిలో జోల పాట వింటూ హాయిగా నిదురించే బుజ్జాయి, మరుభూమి లో శాశ్వతంగా నిద్రిస్తే ఆ తప్పు ఎవరిది?
తల్లి తండ్రులని,తోబుట్టువులని పోగొట్టుకున్న ఆ చిన్నారీ కన్నీటికి జవాబు చెప్పేది ఎవరు?
స్కూలు కి వెళ్ళే ప్రాయం లో నిత్యం తుపాకుల మోత లో,అనుక్షణం భయం తో బిక్కు బిక్కు మంటూ ప్రాణాల కోసం పోరాడుతుంటే,మేమేమీ తప్పు చేశాము అని అడిగితే సమాధానం చెప్పే వారు ఎవరు?
అణ్వాయుధాల వల్ల భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతుంటే మాకెందుకు ఈ శిక్ష అని అడిగితే సమాధానం చెప్పే వారెవరు?
మా బాల్యాన్ని మాకు ఇవ్వండియుద్ధాలు మాకు వద్దు,ఆడుతూ,స్వేచ్చగా తిరిగే అవకాశం మాకు ఇవ్వండి అని అడిగితే సమాధానం చెప్పేది ఎవరు?
రత్నా వెంకట్