Looking out for the Lonely--
----------------------------------------------
1999 లో కొలంబైన్ హైస్కూలులో ఇద్దరు 12 వ తరగతి పిల్లలు మారణాయుధాలతో విచ్చల విడిగా కాల్పులు జరిపి ఆ తరువాత తమను తాము కాల్చుకుని చనిపోయారు. ఈ దారుణ సంఘటన లో 12 మంది విద్యార్థులు, ఒక టీచరు చనిపోయారు. చాలా మంది చిన్నారులు గాయాలపాలయ్యారు.
ఈ విషాద సంఘటన జరిగిన తర్వాత కారణాలు ఏంటని పరిశీలిస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి.
ముఖ్య కారణం ఏమిటంటే, స్కూలు పిల్లలు ఒకరినొకరు బుల్లీయింగ్* చేసుకోవటం శృతిమించి పోతోందట. టీచర్ల సమక్షంలో బాగానే ఉండే పిల్లలు ఆ తర్వాత తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారట. కొంతమంది సున్నిత మనస్కులైన పిల్లలు మానసికంగా కృంగి పోతున్నారట. సామాజికంగా తోటి పిల్లలతో కలిసి పోలేక ఒంటరితనాన్ని భరించలేక హింసాయుతంగా మారుతున్నారట. కొలంబైన్ హైస్కూలులో ఇలా విపరీతంగా బుల్లీయింగ్ కు గురైన ఆ ఇద్దరు పిల్లలూ విసిగిపోయి హింసాత్మకంగా మారి ఇలా సాటి పిల్లలను కాల్చి చంపేశారట.
అదే స్కూల్లో పనిచేస్తున్న టీచరమ్మ ఈ విషాదకర సంఘటన తర్వాత తరగతి గదిలో ఒంటరిగా ఉండిపోయే పిల్లలను గుర్తించటమెలాగో చెబుతోంది. ఇది మనం కూడా మన స్కూల్ తరగతి గదిలో ఆచరించవచ్చు.
వారంలో ఒకరోజు పిల్లలందరూ తమ తరగతిలో తాము ఎక్కువగా ఇష్టపడే తోటి నలుగురు విద్యార్థుల పేర్లను ఒక చీటీ మీద రాసి ఇమ్మని టీచరు అడుగుతుంది. అంతే కాకుండా ఆ వారం best class room citizen ఎవరో కూడా వాళ్ళు రాసి ఇవ్వాలి. ఈ బ్యాలెట్ల సమాచారం గోప్యంగా ఉంచుతుంది టీచరు. ఈ సమాచారం అనలైజ్ చేసి ఆ టీచరు కొన్ని విషయాలను రాబట్టుతుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం
" ఏ విద్యార్థి లేదా విద్యార్థులు ఎక్కువమంది చేత తిరస్కరించ బడుతున్నారు"?.
ఈ విద్యార్థి లేదా విద్యార్థులను గమనించినపుడు వారు తిరస్కరింపబడటానికి ఎన్నో కారణాలు బయటపడతాయి. ఉదాహరణకు నల్లగా ఉన్నారనో, పొట్టిగా ఉన్నారనో, లేదా వేరే కులం లేదా మతం వారనో ..ఇలా ఎన్నో కారణాలు. ఈ కారణాలవల్లనే వాళ్ళు ఇతర విద్యార్థుల చేత పదే పదే బుల్లీ చేయబడతారు. క్లాస్ రూంలో టీచరు సమక్షంలో అందరూ బాగానే ఉన్నా, పిల్లలు ఇతర సమయాల్లో ఇటువంటి బుల్లీయింగ్ కి పాల్పడతారు. ఒక పిల్లవాడు పొట్టిగా ఉండటం వలన బుల్లీ చేయబడుతున్నాడని ఆ టీచరు కు అర్థం ఐనపుడు, పొట్టిగా ఉండటం వలన ఏమేమి లాభాలుంటాయో, లేక పొట్టిగా ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాలు సాధించిన వారి గురించో క్లాస్ రూంలో చెప్పి పిల్లలను ఎడ్యుకేట్ చేయవచ్చు. ప్రతీ వారం ఇలా చేయటం వలన పిల్లలలో ఉండే అపోహలు తొలగి పోతాయి. అందరి మధ్యనా స్నేహం వెల్లి విరుస్తుంది. వారాలు పెరిగే కొద్దీ పిల్లల సామాజిక ఎడ్యుకేషన్ ని కూడా ఆ టీచరు సమర్థవంతంగా చేయగలుగుతుంది. సంవత్సరాంతం వచ్చే సరికి ఒంటరిగా ఉండే విద్యార్థులు ఎవరూ ఉండని స్థితి కి ఆ తరగతి గది చేరుతుంది. ప్రతీ వారం సులువుగా చేయగలిగిన ఈ చిన్న ఎక్సర్సైజ్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ఈ స్కూల్ టీచరు 1999 నుండీ ఈ పని చేస్తోంది. ఇప్పుడామె తరగతిలో ఎవరూ ఎవరిని బుల్లీ చేయరు. అందుకే ఒంటరిగా మిగిలిపోయే పిల్లలూ ఎవరూ లేరు. మన టీచర్లుకూడా ఆచరించగలరు.
* Bar association of India definition of Bullying... “Bullying means systematically and chronically inflicting physical hurt or psychological distress on one or more students or employees. It is further defined as unwanted and repeated written, verbal, or physical behaviour, including any threatening, insulting, or dehumanizing gesture, by a student or adult, that is severe or pervasive enough to create an intimidating, hostile, or offensive educational environment; cause discomfort or humiliation; or unreasonably interfere with the individual’s school performance or participation; and may involve but is not limited to: teasing, social exclusion, threat, intimidation, stalking, physical violence, theft, sexual, religious, or racial harassment, public humiliation, or destruction of property.”
ఇపుడు సమాజంలో హింస పెరిగింది అనిపించటం కూడా బహుశా కుల మతాల పేరుతో జరిగే బుల్లీయింగ్ లే కావచ్చు.
21/7/18
విరించి విరివింటి