V
J:

Junk food

Author Name: Virinchi Virivinti
MISCELLANEOUS TOPICS/ANYTHING

స్విగ్గీకి ప్రతి సెకండ్ కీ రెండుకు పైగా బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయంట.

 

దేశంలో బిర్యానీలను పీక్కుతింటున్నారంట. 

ఐతే ఫ్రీ డెలివరీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కష్టమర్ ఈ ఫ్రీ డెలివరీ ద్వారా ఎంత లాభం పొందారో చెబుతోంది స్విగ్గీ. బెంగుళూరు వాసులు వంద కోట్లను మిగిల్చుకుంటే ఢిల్లీలో ఒక్కతనే 2.5 లక్షలని ఈ ఫ్రీ డెలివరీ వలన డబ్బు ఆదా చేసుకున్నాడని హొయలు పోతోంది స్విగ్గీ. 

బెంగుళూరులో ఒకతను దీపావళికి ఒకేసారి రూ. 75000 పై చిలుకు పీజాలు ఆర్డర్ పెట్టాడంట.

 

ఇకపోతే స్విగ్గీ వచ్చినప్పటి నుండి మూడునాలుగేళ్ళుగా వంటింటికి అడుగుపెట్టని కుటుంబాలు తెలుగు రాష్ట్రాలలో పెరిగిపోతున్నాయి. ఫ్యూచర్ లో వంటిల్లులు లేని ఇళ్ళు కట్టుకునే అవకాశమూ లేకపోలేదు. వంటిల్లెందుకు చీపుగా, స్విగ్గీ మనకు అండగా ఉండగా అనే రోజులూ వస్తాయి. టిఫిన్ లంచ్ డిన్నర్ టోటల్ గా స్విగ్గీతో కానించేస్తున్నారు. ఈ ట్రెండ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉందని వినికిడి. 

 

ఈ ట్రెండ్ పై నా కామెంట్స్ ఏమీ లేవు.

Just an observation 

కాకపోతే ఈ హోటల్స్ లో ఏ నూనెలు వాడతారో ఎంత క్వాలిటీ మెంటెయిన్ చేస్తారో....అన్నీ ఆ కరోనా వాక్సిన్ కే తెలియాలి.

All Replies

New to Communities?

Join the community