V
M:

Music. New thoughts

Author Name: Virinchi Virivinti
SOCIOLOGY/ ARTS AND LITERATURE

సంగీతం. కొత్త ఆలోచనలు.


ఏదైనా ఒక కళను కలిగి ఉండటం దానిని కమర్షియలైజ్ చేసుకుని డబ్బులు సంపాదించడం సర్వ సాధారణం. అది పాట కావచ్చు. కవిత్వం కావచ్చు. రచన కావచ్చు. సంగీతం కావొచ్చు. దాని మీద సర్వ హక్కులూ పబ్లిషర్స్ కీ లేదా సంగీతకారుడికీ లేదా డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ కీ ఉండటం కూడా సర్వ సాధారణం. కళ సూర్యునివలె దారి చూపిస్తుంది అనుకుంటాం. కానీ సూర్యకాంతి వలె అది అందరిదీ కాదు‌. దానిని క్రియేట్ చేసిన వారిది మాత్రమే. ఈ మధ్య ఇళయరాజా తన పాటలను తన పర్మిషన్ లేకుండా మరెక్కడా పాడటానికి వీలు లేదని కోర్టుకెళ్ళడం చూశాం. తన ఆడియన్స్ కీ తనకూ మధ్య ఒక పెద్ద చైనా వాల్ సృష్టించుకున్నాడా అనిపిస్తుంది. అసలు పాట ఎవరిది?. సంగీతం ఎవరిది?. ఒకసారి ప్రజలలోకి వచ్చాక దానిని వారు సొంతం చేసుకున్నాక తమ భావోద్వేగాలను అందులో అనుభవిస్తూ పులకించిపోయాక అదంతా నాదే అని ఎలా అనగలరు?. ఆ భావోద్వేగాలను పొందాలంటే మళ్ళీ నా పర్మిషన్ కావాల్సిందే అని ఎలా చెప్పగలరు.


ఒక్క ఇళయరాజానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంగీతజ్ఞులందరూ ఇప్పటిదాకా ఇలాగే ఆలోచించారు. దీనిని బ్రేక్ చేసేవాడే Kevin MacLeod. Kevin McLeod   ఇది మాకు మాత్రమే చెందిన intellectual property అనుకునే ఒక లోతైన భావనను కూలగొట్టి creativity ని డెమోక్రటైజ్ చేశాడు. కాపీ రైట్ laws కళాకారుడిని అతడి కళను mis use కాకుండా కాపాడతాయి. అందులో సందేహం లేదు. కానీ కళను సొంతం చేసుకోవడం అంటే ఏమిటి?. పాటను సంగీతాన్ని "సొంతం చేసుకోవడం" అంటే ఏమిటి?. ఇది నాది, నేను సృష్టించినది అని లీగల్ గా చెప్పడమా?. లేక ఆ సంగీతం లేదా పాట ప్రతి ఒక్కరి నోళ్ళల్లో నానడమా చెవులల్లో మ్రోగడమా. కెవిన్ ఒక traditional thinking pattern ని కూల్చి  ఈ రెండవ ధోరణిని అనుసరించాడు. సంగీతం exclusive గా నాదే అనకుండా ఇది inclusive గా మనందరిదీ అని ప్రపంచానికి చెప్పాడు. మన భాషకు హేతుబద్ధతకు కూడా communal నేచర్ ఉంటుంది అంటుంది logos concept of Greek philosophy. అలాగే మన సంగీతానికి కూడా. సంగీతం ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి అనుభవాలను భావోద్వేగాలను షేర్ చేసుకోవడానికి ఒక మీడియం అనుకుంటే, సంగీతం మనుషులను కలిపేదిగా ఉండాలి. దానిని వినడానికి తద్వారా పొందే అనందాతిశయాన్నో భావేద్వేగాన్నో చేరడానికి ఏవేవో అడ్డంకులు ఎందుకుండాలి?. 


ఈరోజు ఫేస్బుక్ insta యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో వచ్చే ఏ రీల్ నైనా తీసుకోండి. మీరు అది చూసేటప్పుడు back ground లో వచ్చే మ్యూజిక్ వింటున్నారంటే నూటికి తొంభై తొమ్మిది శాతం అది కెవిన్ సృష్టించిన మ్యూజికే ఐవుంటుందంటే అతిశయోక్తి కాదు. కామెడీ, ట్రాజెడీ, సస్పెన్స్, రోమాన్స్ మీరు ఏ మ్యూజిక్ విన్నా అది దాదాపు కెవిన్ దే. మరో ముఖ్య విషయం ఇప్పటిదాకా మీకు ఆ మ్యూజిక్ ఎవరు సృష్టించారో తెలియకుండానే ఆ మ్యూజిక్ వింటున్నారు. ఆ రకంగా ఇప్పటిదాకా ఎందరెందరో గొప్ప సంగీతజ్ఞులు ఈ ప్రపంచంలో పుట్టి ఉండవచ్చు. కానీ ఇప్పటిదాకా అతి ఎక్కువ మంది విన్న సంగీతజ్ఞుడుగా కెవిన్ ఉన్నత స్థానంలో ఉన్నాడు. అతడు చేసిందల్లా ఒక్కటే. అతడు సృష్టించిన ప్రతీ మ్యూజిక్ బిట్ ని no copy right , free music , గా అందరికీ అవైలబుల్ చేశాడు. ఇప్పటికి రెండు వేల పై చిలుకు free music songs అతడివి యూట్యూబ్ లో లభిస్తున్నాయి. ఇంకా మరిన్ని వస్తూనే ఉంటాయి. షార్ట్ మూవీ మేకర్స్ కి ఇండిపెండెంట్ మూవీ మేకర్స్ కీ అతడు అత్యంత ఆప్తుడు. నేను Perceptions&  Shadows అనే రెండు ఇండిపెండెంట్ సినిమాలనూ కేవలం కెవిన్ background score తో పూర్తి చేయగలిగాను‌. కెవిన్ మ్యూజిక్ లో ఎన్నో నాకు ఇష్టమైనవి ఉన్నాయి. దాదాపు నాకిష్టమైన ప్రతీ బిట్ నా ఫిలింలలో పెట్టుకున్నాను. Laid back guitars ,విశ్రాంతి తీసుకున్న గిటార్ లు అనే ఈ పాట నాకు చాలా ఇష్టం. పర్సెప్షన్స్ మూవీలో పెట్టుకున్నాను. ఎన్నో వందల సార్లు విని ఉంటాను. రెండు గిటార్ లతో ఒక డ్రమ్స్ తో ఒక సుందరమైన కవిత్వాన్ని instruments తో అల్లేశాడు కెవిన్. (Link in first comment) అతడిపై అతడి free music పై అతడి సంగీత ఫిలాసఫీ పై డాక్యుమెంటరీలు వచ్చాయి. కొన్ని హాలీవుడ్ సినిమా మాల్లో కూడా కెవిన్ ఫ్రీ మ్యూజిక్ ని వాడుకున్నారు అంటే అతడెంతగా తన సంగీతంతో ఉర్రూతలూగించాడో మరి.


ఐతే మరో విచిత్రం. సరిగ్గా ఇలాగే ఆలోచించే నా మరో మిత్రుడు ఉన్నాడు. అతడి పేరు కూడా Kevin. ఐతే అతడు Kevin D'Costa. 

ఇతడిని నేను యూట్యూబ్ ద్వారా పట్టుకున్నాను. మూడేళ్ల క్రితం ప్రత్యేకంగా చెన్నై కి వెళ్ళి కలిశాను. బీదరికం ఉంది కానీ అద్భుతమైన శక్తి ఉంది. రోజుకు ఇరవై గంటలు చొప్పున  సంవత్సరాల తరబడి సంగీత సాధన చేసిన సిన్సియారిటి ఉంది. రీల్స్ లో ఇండియన్ స్టైల్ మ్యూజిక్ వినబడ్డదంటే ఆ ఫ్రీ మ్యూజిక్ దాదాపు మన దేశపు కెవిన్ దే. నా Blood & Rain మూవీకి ఈ కెవిన్ డికోస్టానే సంగీతం. అసలు ఎవరు వీళ్ళంతా. సంగీత పిచ్చి వాళ్ళు. గొప్పదనాన్ని పేరు ప్రఖ్యాతులతోనూ, పాపులారిటీతోనూ, ఐశ్వర్యంతోనూ మాత్రమే కొలిచే సమాజంలో గుర్తింపులు ఆశించకుండా కాపీ రైట్లతో డబ్బు సంపాదించడమనే స్పృహ లేకుండా సంగీతంతో తమ పని తాము చేస్తూ సాగిపోయేవారు, సంగీతంతో 

మనల్ని కలిపే వాళ్ళు?. ఈ ఇద్దరు కెవిన్ లకు డబ్బులు ఎక్కడినుండి వస్తున్నాయి?. ఫ్రీగా సంగీతం వినే మనం ఎపుడూ ఇవ్వలేదు.ఎవరిస్తారు?. వాళ్ళేమో సంగీతం మనందరిదీ అంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆలోచనల్లో కొత్త పుంతలు తొక్కుతూ అందరివారౌతూనే ఉన్నారు.


విరించి విరివింటి

All Replies

New to Communities?

Join the community