సీరియస్లీ..
మనం ఏదైనా ఒక పాపులర్ పోస్ట్ పై ఏమేమి కామెంట్స్ వచ్చాయో చూద్దాం..తద్వారా జనాలు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుందాం అని చూస్తూ ఉంటాం. నిజంగా ఈ సోషల్ మీడియా జనాల ఆలోచనల పల్స్ ని పట్టి ఇస్తుందా?
ఇది ఒక రకమైన false consensus effect.
ఉదాహరణకు, ఒక సెలెబ్రిటీ విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే...ఆ సెలెబ్రిటీని తిడుతూ, వాళ్ళ కులాన్నో మతాన్నో బూతులు తిడుతూ చాలా కామెంట్స్ ఉంటాయి. దానిలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపే కామెంట్స్ కూడా ఉంటాయి. కానీ మనకు మొదటి రకం కామెంట్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమంటే ఈ సోషల్ మీడియా ఆల్గొరిథంలో బాగా ఎక్కువగా రిప్లై లు లైక్ లు వచ్చిన కామెంట్ పైకి వచ్చేస్తుంది. కాబట్టి మనం కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోతే చాలామటుకు ఈ బూతుల రాయుళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది వారిని సపోర్ట్ చేస్తూనో ఖంఢిస్తూనో కామెంట్స్ పెడతారు కాబట్టి అవే పైకి మనకు కనబడుతుంటాయి.
కాబట్టి ఆ కామెంట్స్ చూసి ఏంట్రా జనాలు ఇలా ఐపోయారని బాధ పడటంలో డిప్రెస్ ఫీలవడంలో అర్థం లేదని నాకనిపించింది. ఎందుకంటే మనకు కనిపిస్తున్న కామెంట్స్ చెత్త లేకినాయాళ్ళవి. వారిని చూసి లోకమంతా ఇలాగే ఉందని అనుకోవడమే false consensus effect.
చెప్పొచ్చేదేమంటే మనుషుల్లో దొంగనాయాళ్ళకంటే మంచోళ్ళే ఎక్కువగా ఉంటారు. అది మనం చూడగలగాలంటే డైరెక్ట్ మనుషులతోనే మాటలాడాలి. సోషల్ మీడియాలో కనిపించేది మనషుల వికృత రూపాలు మాత్రమే. ఇదే మనుషులు నిజంగా మనం మాట్లాడినప్పుడు ఆ విధంగా మాట్లాడకపోవచ్చు మామూలుగానే గౌరవ ప్రదంగానే మాటలాడతారేమో అని నాలో ఒక ఆప్టిమిజం ఈ డిప్రెషన్ ని తగ్గిస్తూ ఉంటుంది.
విరించి విరివింటి
21/11/2024