మన జీవితాల్లోకి చాలా MUST DOs వచ్చి చేరాయి.
మొదటి రోజే మొదటి షో సినిమా చూడటం దగ్గర నుండి మొదలైతే సోషల్ మీడియాలో అర్జంట్ గా MUST గా పోస్ట్ పెట్టేదాకా ఇవన్నీ వివిధ రూపాల్లో జీవితాల్లోకి వచ్చేసి ఒక norm గా మారిపోయాయి. పుణ్యక్షేత్రాల దర్శనాలు కూడా ఇందులో వచ్చి చేరాయి.
జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్ర దర్శనం చేసుకోవాలి అనుకునేది కనుమరుగై ఇకపై "ప్రతీ సంవత్సరం ఒక్కసారైనా" కి మారిపోయాయి. జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలని లేదా తిరుపతి చూడాలనీ కలలుకనే రోజులనుండి సంవత్సరానికి ఒకసారి MUST VISIT లిస్టులో కి వచ్చేసాయి. బహుశా transport సౌకర్యాలు పెరగటం, ఇతర విశ్రాంతి సదుపాయాలు పెరగటంతో ఇలాంటి కొత్త consciousness వచ్చి చేరింది. దీనిలో భక్తి కంటే ఎక్కువగా ఏదో ప్రదర్శన తాలుకు అంశమేదో వచ్చిందని నాకనిపిస్తుంది. ఒక్కోసారి అది ఒక కుటుంబం సాంప్రదాయం గా మారిపోవడం, ఒక్కోసారి అనవసర భారంగా మారడం కూడా ఉంది. ఏదో పవిత్రమైన రోజు తప్పని సరి ఏదో దానం చేయాలనో, పలానా ద్వారం నుండే తప్పని సరి దర్శనం చేసుకోవాలనో రెచ్చగొట్టే వారు, ఇదంతా వీడియో తీసి తమ రాజకీయ దక్షత చూపాలనుకునే వారూ ఉంటారు. ఐతే హిందూ మతంలో సగుణోపాసన మాత్రమే కాదు. నిర్గుణోపాసన కూడా ఉంది. ఒకరకంగా అది చరిత్రలో ఉపనిషత్తుల ప్రభావంతో ఒక విప్లవంగా ఉధృతంగా కూడా ఉండింది. సకల మూఢనమ్మకాలనూ విశ్వాసాలనూ వాటి చుట్టూ ఉండే చిక్కు సమస్యలను పరిష్కరించాలని హేతువాద పద్ధతిలో అన్నింటికంటే పైన మనిషిని నిలబెట్టాలని ఉపనిషత్తులు ప్రయత్నించాయి. (వ్యక్తికన్నా ఘనమైనది ఇంకొకటి లేదు- ఉపనిషత్వాక్యం) భగవంతుని తనలోపలే దర్శించుకోవాలనీ అదే ఆత్మ సాక్షాత్కారమనీ, దాని సాధన లోలోపలే మౌనంగా గంభీరంగా ప్రదర్శనలు లేకుండా నిర్మలంగా జరిగిపోతుండాలనే ఫిలాసఫీ దాదాపు కనుమరుగైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆలోచనాపరులను ఆకర్షించిన ఉపనిషత్తులను తీసి దాదాపు అటకమీద వేసేశాం. ఏదో పైపై భక్తినో, అందరూ పాటించే ఆచారాన్నో బయటికి బాహాటంగా ప్రదర్శిస్తేనే మతస్థుడనే స్పృహ పెరిగింది. అలా చేస్తే దైవ కృప లభిస్తుందనే స్పృహ వచ్చేసింది. పైగా ఇదంతా పొలిటిసైజేషన్ కూడా అయింది.
ఏమైనా ఈ రోజు పండగ ఆర్భాటం లో భాగంగా గాలిపటాలు ఎగరేస్తూ మృత్యువు కౌగిట్లోకి పోతున్న కొంతమందిని హాస్పిటల్ లో చూశాక "హే భాయ్ జరా దేఖ్ కే చలో.." మరీ అంత అవసరం లేదు. కాస్త నింపాదిగా వెళ్ళు. ప్రతిది MUST DOs లిస్టులో పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పాలనిపించింది.
సింపుల్ గా పండుగలు చేసుకోండబ్బా...
ఫేస్బుక్ లో మీడియాలో పండుగ ఆర్భాటాలు చేసేవాళ్ళను చూసి చేతులు కాల్చుకోకండి. పిచ్చలైట్ తీసుకోండి.
అదీ మ్యాటర్.