V
C:

Crowd pooling

Author Name: Virinchi Virivinti
SOCIOLOGY/POLITICS

Crowd pooling అనే విషయం పాత చింతకాయ పచ్చడి వంటిది. మనకు రాజకీయ నాయకుల సభలు మొదలుకుని స్వామీజీల ప్రసంగాలు, పాస్టర్ల ప్రసంగాలు, దేవాలయాల్లో దర్శనాలు, సినిమా రిలీజ్ ఫంక్షన్ లు వంటివన్నీ crowd pooling అనే విషయం మీదనే నేటికీ ఆధారపడి ఉన్నాయి. ఎంత ఎక్కువ మంది అక్కడ ఉంటే అంత గొప్ప సభ అనీ అంత గొప్ప విషయమనీ అనుకునే పురాతన భావజాలం మన మెదళ్ళలో నిండిపోయింది‌. మన మెదళ్ళు ఈ సకల పురాతన భావాలను మోసే భరించనలవిగాని  ఓ మ్యూజీయంలా తయారైంది.


Modern thinking లో how to avoid crowd pooling అనేది ఉండాలి. ఏదైనా ఒకచోట ఎక్కువ మంది జనాలు ఎందుకు గుమిగూడాలి?. దానివలన ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇంతగా టెక్నాలజీ పెరిగాక కూడా ఇంకా crowd pooling కి అర్థం లేదు.


రాజకీయ నాయకులు బహిరంగ సభలు ఎందుకు చేయాలి. ప్రజలను లారీల్లో ఎందుకు తరలించాలి?సభ ఘనవిజయం అయిందని ఎందుకు జబ్బలు తరచుకోవాలి? ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా చేయవచ్చు. లేదా ఒక పెద్ద హాల్ లో కొంతమందిని పిలిచి, అన్ని టీవీ ఛానెల్స్ లో ప్రసారం అయ్యేలా చేస్తే చాలు కదా. Purpose - అతడి మాటలను ప్రజల్లోకి తీసికెళ్ళడం అనుకుంటే దానికి భారీ బహిరంగ సభతో మాత్రమే సాధ్యమని నేటికీ అనుకోవడం విచిత్రం.‌ ఎంత భారీ బహిరంగ సభ చేస్తే అంత బలముందని అనుకోవడం ఎందుకు?. గతంలో ఇలాంటి ఆలోచనలన్నీ తప్పు అనీ తేలింది. డబ్బులిచ్చి సభలకు తరలించడం మనకందరికీ తెలుసు. ఐనా దీనినే పట్టుకుని వేళ్ళాడటం ఎందుకు?. రాజకీయాల్లోకి యువత రావాలి అంటే వచ్చి ఏం చేయాలి? అవే పాత చింతకాయ ఆలోచనలను కొనసాగిస్తూ ఫ్యూడల్ భావజాలాలను కలిగి ఉండాలా?. సినిమాలు మతాల ప్రవచనాలు ఆఖరికి దేవాలయాల్లో దర్శనాలు అన్నీ prior appointment సహాయంతో వీలైనంత flexible గా తయారు చేయవచ్చు. We need visionaries.

All Replies

A

Visionaries కి ఎలాంటి లక్షణాలు ఉండాలి సార్?

Please log in to reply.

New to Communities?

Join the community