కొద్ది నెలల క్రితం,Susila Kambhampati గారి Essence Zoom Session అద్భుతంగా జరిగింది.1920ల నుంచి నేటి వరకు మన దేశం, సమాజంలో వచ్చిన పలు మార్పుల గురించి సంవత్సరాలతో సహా చాలా చక్కగా వివరించారు. సుశీల గారు చెప్పిన అంశాల్లో ఆడపిల్లల చదువు, విద్యావకాశాలు, వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో స్త్రీల ప్రస్థానం, క్రిస్టియన్ మిషనరీల పాత్ర ఇలాంటి కొన్ని వివరాలు...
National girl child day సందర్భంగా...
The essence group
కైఫీయతలు: సుశీల కంభంపాటి
Part -1
ఇంగ్లీషు వారు దేశం వదిలాక సరైన ఖైఫీయతలు జరగలేదు.
Khaifiyathu అంటే స్థానిక వివరాలు నమోదు చేయడం, ఏ గ్రామం ఎలా ఉంది, ఎలా అభివృద్ధి చెందింది అనే వివరాలు నమోదు చేయడం.
ప్రశ్న:ఏ దశాబ్దంలో పెద్ద మార్పులు మీరు చూశారు?
సుశీల కంభంపాటి:సమాజంలో పెద్ద మార్పులు 1950 లలో వచ్చాయి..
అప్పటివరకు లేనిది ఆడపిల్లల చదువు..The biggest revolution...
1920 లలో మా మేనత్తలు చదువుకున్నారు, కాలేజీ డిగ్రీలు తెచ్చుకున్నారు.కానీ అలా ఎంత మంది అని చూస్తే నూటికి ఇద్దరు,ముగ్గురు మాత్రమే..అలా చూస్తే ఆడపిల్లల చదువు విషయంలో 1950,60 లలో పెద్ద మార్పు వచ్చింది.
గొప్ప విశేషం ఏంటి అంటే ఆరోజుల్లో ప్రవచనకారులు లేరు,దానివల్ల సంఘానికి చాలా ఉపకారం జరిగింది.ముందుకి వెళ్తుంటే వెనక్కి లాగడం జరగలేదు.అది గొప్ప విశేషం...
పదండి ముందుకు పదండి తోసుకు అన్నారు తప్ప వెనక్కి వెళ్ళిపోదాం అనలేదు..
1930 కంటే 40 లలో,40 కంటే 50 లలో,50 కంటే 60 లలో గొప్ప మార్పులు వచ్చాయి...
గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం లాంటి మహానుభావులు "ఆడపిల్లలకు విద్య కావాలి,వాళ్ళని చదివించండి,ఇంటికి పరిమితం చేయకండి" అన్న మాటలతో ప్రజలు ముందడుగు వేశారు.
ఆడపిల్లల చదువు:
ఆడపిల్లల చదువు మగవాళ్లకంటే చాలా వెనుక ఉండేది.
1920,30 లలో ఆడపిల్లలకి విద్య అందుబాటులో లేదు.1930,40 లలో ఇంటర్మీడియట్ చదివితే పెళ్లికి అర్హత వచ్చిందని పెళ్లి చేసేవారు.
రెండు సంవత్సరాల కాలేజీ చదువు చాలు అనుకునేవారు.
ఆ తర్వాత పెళ్లిళ్లు ఆలస్యం చేయడానికి ధైర్యం వచ్చింది.
నెమ్మదిగా 1930 చివరలో B.A, B.Ed లు చదవడం ప్రారంభమైంది .
అబ్బూరి ఛాయాదేవి గారు 1933లో పుట్టారు, M.A చదివారు.
ఇంజనీరింగ్‌లో ఆడపిల్లలు:
ఇంజనీరింగ్‌లో ఆడపిల్లలకు అవకాశం ఉండేది కాదు.
1960 లో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి ఆడపిల్ల చల్లా వారి అమ్మాయి .ఆడపిల్ల ఇంజనీరింగ్‌లో చేరిందని వింతగా చెప్పుకునేవారు.
వైద్య వృత్తిలో ఆడపిల్లలు:
మెడికల్ కాలేజీల్లో కూడా ఆడపిల్లలు చాలా తక్కువ మంది ఉండేవారు.
1940లలో మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తొలి మహిళ కొమర్రాజు అచ్చమాంబ గారు.
1940,50లలో బాల్య వితంతువుల విద్య & డాక్టర్లుగా మారడం:
వీరేశలింగం గారి కాలంలో వితంతు పునర్వివాహాలు మొదలయ్యాయి కానీ తరువాత ఆగిపోయాయి. కానీ
బాల్య వివాహాలు జరుగుతూనే ఉండేవి.1953లో బాల్య వివాహాల నిషేధ చట్టం (శారద చట్టం) వచ్చింది. కానీ దాని అమలు సరిగ్గా జరగలేదు.
1950లలో అగ్ర కులాల్లో ఒక రకమైన మార్పు వచ్చింది.
బాల్య వితంతువులకు వైద్య విద్య చదివించారు.
అలా అగ్ర కుల వితంతువులు MBBS, RMP చదివి వైద్య వృత్తిలోకి చేరారు.
1917లో పుట్టిన కామేశ్వరమ్మగారు తో పాటు రాజమండ్రిలో కనీసం 10-15 మంది బ్రాహ్మణ వితంతువులు డాక్టర్లు అయ్యారు.
వారిలో కొంతమంది శకుంతలమ్మగారు, కామేశ్వరమ్మగారు, అచ్చమ్మగారు.
బ్రహ్మ సమాజం ప్రభావం:
బ్రహ్మ సమాజం బెంగాల్ నుండి ప్రారంభమై తమిళనాడు వరకు విస్తరించింది. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వంటి మహనీయులు మూఢనమ్మకాలు నిర్మూలించడానికి,ఆడవాళ్లను చదివించడానికి పాటుపడ్డారు. ఇది ప్రధానంగా బ్రాహ్మణ వర్గాల్లో కనిపించింది, ఎందుకంటే మార్పును వారు త్వరగా స్వీకరించారు.
ఇంగ్లీషు విద్యను ఉత్సాహంగా ఆడపిల్లలకు అందించారు.
క్రిస్టియన్ మిషనరీల ప్రాముఖ్యత:
మిషనరీల కారణంగా దళితులు కూడా ఆడపిల్లలకు విద్యను అందించగలిగారు.
క్రిస్టియానిటీ స్వీకరించిన వారికి అభ్యుదయ భావాలు వచ్చాయి.బ్రాహ్మణ వితంతువులతో పాటు క్రైస్తవ మిషనరీల సహాయంతో దళిత స్త్రీలు కూడా వైద్యవిద్యలో అడుగుపెట్టారు.ఇటు అగ్రవర్ణాలు, అటు అట్టడుగు వర్గాల్లో క్రిస్టియానిటి కి మారినవారు మాత్రమే వైద్య విద్య చదవడానికి అవకాశాలు ఉండేవి. మధ్య వర్గాల వారికి ఆ అవకాశం తక్కువ.అమరేంద్ర దాసరి గారి తల్లి నంబూరి పరిపూర్ణ గారు 1944లో పాఠశాల విద్య పూర్తి చేసిన మొట్టమొదటి దళిత మహిళలలో ఒకరు.
క్రైస్తవ మిషనరీలు ఆసుపత్రులను ఏర్పాటు చేసి, వైద్యం అందించడంతో పాటు, నర్సులుగా,డాక్టర్లుగా శిక్షణ ఇచ్చి ఆడపిల్లలకు ప్రాథమిక వైద్య నైపుణ్యాలు అందించాయి.తొలినాళ్లలో మిషనరీ ఆసుపత్రులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ,మంచి వైద్యం, గర్భిణుల సుఖప్రసవం వంటి సేవల ద్వారా ప్రజలలో విశ్వాసం పెరిగింది. మిషనరీల సహకారం స్త్రీల ఆర్థిక స్వావలంబనకు మరియు వైద్య రంగంలో ప్రవేశానికి ఒక మైలురాయిగా నిలిచింది.
ఇంగ్లీషు వారి ప్రభావం:
ఇంగ్లీషు వారు మనల్ని పరిపాలించారని ద్వేషం ఉండొచ్చు కానీ వారు మనకు బేసిక్ ఎడ్యుకేషన్ మరియు వైద్యం ఇచ్చారు.
నేను 1941లో రామచంద్రపురంలో హాస్పిటల్‌లో పుట్టాను.చెలికాని కమలమ్మ గారు,చెలికాని రామారావు గారు డాక్టర్లు. ఆరోజుల్లో hospital లో delivery చాలా అరుదు.
Level complex and Materialistic attitude:
మణిశంకర్ అయ్యర్ ఏమని చెప్పారంటే, మనకు డాక్టర్ల కంటే నర్సులు ఎక్కువ కావాలి. సివిల్ ఇంజనీర్లకంటే డ్రాఫ్ట్మెన్, లోయర్ లెవెల్ వర్కర్స్ కావాలి.
కానీ మన సమాజంలో లెవెల్ కాంప్లెక్స్ చాలా ఎక్కువ.
ప్రతిదానికీ ఒక హై లెవెల్ ఉండాలి.
హై లెవెల్ కోసమే ప్రయత్నించాలి అనుకుంటారు.
టీచర్లు,హైస్కూల్ లో తప్ప, ఎలిమెంటరీ స్కూల్స్ లో టీచింగ్ చేయడానికి ఇష్టపడరు.
దేశం ముందుకు వెళ్లాలంటే మనకు కావాల్సింది మంచి ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు,రోగులు బతకడానికి నర్సులు..
కానీ ఈ లెవెల్ కాంప్లెక్స్ కారణంగా ప్రతి ఒక్కరు ఏది ఎక్కువ డబ్బు తెచ్చిపెడుతుందో, ఏది సోషల్ రికగ్నిషన్ ఇస్తుందో ఆ చదువులను ఎంచుకుంటున్నారు.మిగిలిన చదువుల గురించి ఆలోచించడం లేదు.క్వాలిఫికేషన్‌ను బట్టి కూడా ఈ దిశలో మార్పులు జరగడం లేదు.
మన హాస్పిటల్స్ లో, మెడికల్ కాలేజీలలో 60% మంది ఆడపిల్లలు అని రొమ్ములు చరుచుకుంటారే కానీ అందులో ఎంతమంది నర్సులుగా చేరి, సంఘ గౌరవం సంపాదించగలుగుతున్నారు?
మా స్కూల్లో పిల్లలు ఏం చదువుతారు అని అడిగితే,మనకు నర్సులు చాలా ముఖ్యం, చాలా గొప్ప ఉద్యోగం అని చెప్తే, మేము దాన్ని చేయలేము.మా ఇళ్లలో కూడా అది ఒప్పుకోబడదు అంటారు.
ఇక్కడ అమెరికాలో క్వాలిఫైడ్ మరియు ఇంటెలిజెంట్ పీపుల్ చాలామంది నర్సింగ్ రంగంలో చేరినందుకు గౌరవంగా, దర్జాగా మేము మాకు ఇష్టం కాబట్టి ఈ రంగం ఎంచుకున్నాం అంటారు
మనం హ్యూమన్ బేసిక్ నీడ్స్‌ను పట్టించుకోకుండా పైకి ఎదగాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాం.
UPSC పరీక్షల కోసం జీవితం నాశనం చేస్తున్నారు.కానీ మనకు అవసరమైన ఇతర చదువులు,వృత్తి విద్యలు, ట్రైనింగ్‌పై దృష్టి పెట్టడం లేదు.
Indian attitude మారిపోయింది. కేవలం Materialistic advancement మీదే దృష్టి. దాని వల్ల చైనాలో జరిగినంత అభివృద్ధి మనకి జరగలేదు.
దేశం మరింత అభివృద్ధి చెందాలంటే
ప్రతి ఒక్కరికీ బేసిక్ ఎడ్యుకేషన్, సమాన అవకాశాలు అందించాలి.
ప్రతి వృత్తి గౌరవనీయమైనదే అని సమాజంలో చైతన్యం రావాలి
Devi Polina